ఫుట్‌పాత్ ఆక్రమణలపై..ఉక్కుపాదం


Sun,February 17, 2019 01:16 AM

-ఇప్పటి వరకు 16,046 నిర్మాణాల కూల్చివేత
-శనివారం 646 ఆక్రమణల తొలిగింపు
-జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో చర్యలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఫుట్‌పాత్‌లపై వెలిసిన 646 అక్రమ నిర్మాణాలను శనివారం జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది కూల్చివేశారు. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు ఆర్ట్స్ నుంచి టెంపుల్ బస్‌స్టాప్ వరకు మూడు బృందాలు, కూకట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయం మార్గంలో మరో మూడు బృందాలను ఆక్రమణలను తొలిగించడానికి నియమించారు. ఇప్పటి వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది మొత్తం 16,046 ఆక్రమణలను కూల్చివేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...