నిఘా నేత్రాలే... కనిపెట్టాయి


Sun,February 17, 2019 01:06 AM

-కేరళ నుంచి ఇల్లొదిలి హైదరాబాద్ చేరుకున్న బాలుడు
-వారం రోజులుగా తల్లిదండ్రుల ఆందోళన
-సీసీ కెమెరాలను జల్లడ పట్టి.. కుటుంబసభ్యులకు అప్పగించిన నాంపల్లి పోలీసులు
బేగంబజార్: ఇల్లొదిలి వెళ్లిపోయిన ఓ బాలుడిని సీసీ కెమెరాలు కనిపెట్టాయి. అతన్ని నాంపల్లి పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సుభాష్‌చంద్రబోస్, ఎస్సైలు సైదా, ప్రమోద్‌రెడ్డిలతో మాట్లాడుతూ కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన బాలుడు (17 ) 9న కుటుంబ సభ్యులు పరీక్షలు సమీపిస్తున్నందున ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలంటూ.. ఒత్తిడి చేయడంతో కేరళ రైల్వే స్టేషన్‌లో టికెట్ లేకుండా శబరి ఎక్స్‌ప్రేస్‌లో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యాడు. కాగా, ఆ బాలుడు తప్పిపోయిన విషయం కేరళ రాష్ట్రం సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాప్తి చెందడంతో ఓ మహిళ స్పందించి.. కేరళ పోలీసులకు తానూ చూశానని సమాచారం అందించింది. ఆ మహిళ ఇచ్చిన సమాచారంతో కేరళ పోలీసులు మొదట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉన్న అధికారులను సంప్రదించి.. సీసీ ఫుటేజీలను పరిశీలించగా, రైల్వే స్టేషన్‌కు రాలేదని గుర్తించి అదే రోజు నాంపల్లి పోలీసులకు ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై సైదా నాంపల్లి రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆరు గంటల వరకు నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ ఫాంపై బాలుడు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఒక ద్విచక్రవాహనంపై వెళ్లడం గమనించారు. ఇదిలా ఉండగా, బాలుడు రైల్వే స్టేషన్ ఆవరణలో లంగర్‌హౌస్‌కు చెందిన లారీ డ్రైవర్ గోపాల్‌ను లిఫ్ట్ అడిగి లంగర్‌హౌస్‌కు చెరుకున్నాడు. అనంతరం గోపాల్ ఫోన్ నుంచే బాలుడు తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడడంతో ఆ ఫోన్ కాల్‌ను ట్రేస్ చేయడంతో పాటు, సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా లంగర్‌హౌస్‌లో ఓ షోరూంలో పనిచేస్తున్నట్లు గుర్తించి..ఆ బాలుడిని శనివారం రాత్రి తల్లిదండ్రులకు అప్పగించారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...