సాహసమే ఊపిరి..


Sun,February 17, 2019 01:06 AM

ఉల్లెంగ రామారావు (మల్కాజిగిరి, నమస్తే తెలంగాణ) : విద్యార్థులు, మహిళలు తమను తాము రక్షించుకునేందుకు సాహసి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో మేడ్చల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సాహసి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు గ్లోబల్ ఏంజల్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు యమున పాఠక్ తెలిపారు. జనవరిలో శిక్షణను ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతివారంలో ఒకరోజు గంటన్నర పాటు బాలికల అంతర్జాతీయ ట్రైనీల ద్వారా 7, 8, 9, 10 తరగతుల బాలికలకు శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం 15 మంది బాలికలకు శిక్షణను ఇస్తున్నారు.
ఆత్మరక్షణ కోసం..
వనితల ఆత్మరక్షణ కోసం సాహసి కార్యక్రమం పాఠశాలలతో పాటు కాలనీల్లోని మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు ట్రస్ట్ వ్యవస్థాపకురాలు యమున పాఠక్ ప్రచారం చేపట్టారు. తాము ఇప్పించే శిక్షణలో మహిళలందరూ పాల్గొనాలని కోరుతున్నారు. రానున్న రోజుల్లో నగరంలో పూర్తి స్థాయిలో సేవలు విస్తరిస్తామని తెలిపారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...