కార్మికులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి


Sun,February 17, 2019 01:04 AM

-సహాయ కార్మిక కమిషనర్ శ్యాంసుందర్‌రెడ్డి
- ప్రధానమంత్రి శ్రమయోగి మాన్-ధన్ పెన్షన్ పథకంపై కార్మికులకు అవగాహన
చర్లపల్లి : భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ పథకాలను వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సహాయ కార్మిక కమిషనర్ శ్యాంసుందర్‌రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్దచర్లపల్లిలో దుర్గామాత భవన నిర్మాణ కార్మిక సంఘం, పెయింటర్స్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్-ధన్ పెన్షన్ పథకంపై కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు, ఇంటి పని కార్మికులు, బీడీ కార్మికులు, రిక్షా కార్మికులు, స్ట్రీట్ వెండర్స్, ఇటుక బట్టి కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, వ్యవసాయ, చేనేత, తోలు పని కార్మికులు సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్మికులు ప్రతి ఒక్కరు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 18 ఏండ్లు నిండిన కార్మికులు పథకానికి అర్హుడని, 60 ఏండ్లు నిండిన కార్మికుడికి రూ.3వేల చొప్పున పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం పథకం ప్రవేశపెట్టిందన్నారు. మరిన్ని వివరాలకు సహాయ, కార్మిక కమిషనర్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఎల్‌ఐసీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రవివర్మ, కామన్ సర్వీస్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ ప్రమోద్‌రెడ్డి, ఎస్‌బీఐ అధికారి సుధాకర్‌రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాపయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశ్ తదితరులు పథకంపై అవగాహన కల్పించారు. కార్మిక శాఖ అధికారులు శ్రీనివాస్, రేణుక, రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, గృహ కార్మిక మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మస్తాన్‌బీ, దుర్గామాత భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు చిందం వెంకటేశ్, కార్యదర్శి మందుల మల్లేశ్, నాయకులు కొస్గి క్రిష్ణ, చిరంజీవి పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...