సైబర్ నేరాలు అడ్డుకుందాం


Sun,February 17, 2019 01:01 AM

జీడిమెట్ల: ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు జరిపే వ్యక్తులు సైబర్ నేరాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ సైబరాబాద్ ఏసీపీ సీహెచ్ వై శ్రీనివాస్‌కుమార్ కోరారు. శనివారం రాత్రి జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఉన్న జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్ సమావేశం మందిరంలో జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్, సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ సైబరాబాద్ సంయుక్తాధ్వర్యంలో సైబర్ నేరాలు జరుగకుండా పరిశ్రమల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో, ఎవరు చేస్తున్నారో, ఎవరు మోసపోయారో అనే అంశాలపై డిజిటల్ స్క్రీన్‌పై వివరించారు. ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ మాట్లాడుతూ సైకిల్, స్కూటర్, కార్లు దొంగతనాలతో ప్రారంభమైన నేరాలు తారాస్థాయికి చేరి ఆన్‌లైన్‌లో హ్యాకర్స్ కోట్లాది రూపాయలను హ్యాకింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇంటర్‌నెట్ కనెక్షన్, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఇతరుల ఈ-మెయిల్స్, డేటాను సేకరించి ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు జరిగే సమయంలో నేరగాళ్లు హ్యాకింగ్ చేస్తున్నారన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 18 సైబర్ కేసులు నమోదు కాగా, 8 కోట్ల రూపాయలు హ్యాకింగ్ జరిగాయన్నారు. హ్యాకర్లకు సర్‌ఫేస్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్ తదితర గూగుల్‌ను ఏర్పాటు చేసుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2018లో రూ. 15 లక్షల కోట్ల డాలర్లను ఆన్‌లైన్‌లో హ్యాకింగ్ చేశారని శ్రీనివాస్‌కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ గౌతమ్, జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ శ్రీనివాస్‌లతో పాటు పరిశ్రమల నిర్వాహకులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...