బేఫికర్..మెట్రోలో వస్తువులు పోతే


Sat,February 16, 2019 12:38 AM

-90 రోజుల్లో ప్రయాణికుడికి అప్పగింత
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మెట్రోరైలు ప్రయాణంలో మీ వస్తువు పోగొట్టుకున్నా, మర్చిపోయినా చింతించాల్సిన పనిలేదు. మెట్రోరైలు సిబ్బంది సురక్షితంగా మీకు అందజేస్తారు. అలాగని నిర్లక్ష్యంగా ఉండకండి సుమా!. మెట్రోలో ప్రయాణిస్తూ మీ వ్యాలెట్స్, పెన్నులు, మొబైల్ ఫోన్లు, స్టేషనరీ ఏదైనా సరే వదిలివెళ్లిపోతే జాగ్రత్త చేస్తారు. స్టేషన్ మేనేజర్ల వద్ద జాగ్రత్తగా ఉంచుతారు. పోగొట్టుకున్న వ్యక్తి వస్తే అందజేస్తారు. మెట్రో స్టేషన్లలో ఉన్న కెమెరాలు, మెట్రో కోచ్‌ల్లో ఉన్న కెమెరాలు ఎవరి వస్తువో గుర్తిస్తాయి. వస్తువు యజమానికి మెట్రో బృందం సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. సెంట్రల్ సర్వర్‌లో ఉన్న వీడియో ఫుటేజీ ఆధారంగా యజమానిని సులభంగా గుర్తిస్తారు. అంతేకాకుండా మెట్రో పరిసరాల్లో ఎవరైనా వస్తువులు వదిలివెళితే వాటిని విప్పి చూడకుండా మెట్రో స్టేషన్ సిబ్బందికి గానీ, కస్టమర్ కేర్ సెంటర్ నంబర్ : 040-2333 2555కు సమాచారం ఇస్తే సెక్యూరిటీ సిబ్బంది వస్తువును సేకరించి పరీక్షిస్తారు.

192
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...