ఆహ్లాదం..ఆనందం..ఆరోగ్యం


Sat,February 16, 2019 12:36 AM

-సైకిల్, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం
-హెచ్‌ఎండీఏ పరిధిలో 16 చోట్ల రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ఆరోగ్యం, ఆహ్లాదం కోరుకునే నగరవాసుల కోసం హెచ్‌ఎండీఏ ఆక్సిజన్ తరహా పార్కులకు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చే చర్యల్లో భాగంగా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో 16 చోట్ల ఆక్సిజన్ పార్కు తరహాలో రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి, యాదాద్రి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 5921.53 హెక్టార్లలో రూ.96.64కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రతిపాదిత 16 ప్రాంతాల్లో ఇంజినీరింగ్ విభాగం అధికారులు చైన్ లింకు ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించనున్నారు. ఇక అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు ఇంటెన్వీవ్ మెథడ్ పద్ధతిలో లక్షలాది మొక్కలను నాటనున్నారు.

ఉద్యానవనాలుగా బీడు భూములు..
బీడు భూములుగా ఉన్న ప్రాంతాలు ఉద్యానవనాలుగా మారబోతున్నాయి. గుబురు పొదలతో, చెత్త చెదారాలతో వృథాగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ప్రకృతి రమణీయ వాతావారణాన్ని సంతరించుకోనున్నాయి. ఔటర్ కేంద్రంగా రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లు ( లంగ్ స్సేస్‌లు)ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్‌ఎండీఏ అన్నీ ఏర్పాట్లు చేసింది. స్థానిక ప్రజల నడక కోసం వాకింగ్ పాత్‌వేలను సైకిలింగ్ కోసం సైకిల్ ట్రాక్‌లు, పిల్లలు ఆడుకునే విధంగా చిల్డ్రన్‌కార్నర్లు రానున్నాయి. యోగాసెంటర్లు, జనం కూర్చునేందుకు భారీ వృక్షాల కింద రచ్చబండలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...