తరిచి చూస్తే.. కన్నీటి ధారే..


Sat,February 16, 2019 12:35 AM

-15 రాష్ర్టాలకు చెందిన వారు..
బాలాపూర్ మండలం నాదర్‌గుల్ అశోక్‌రెడ్డినగర్‌లోని సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమంలో 15 రాష్ర్టాలకు చెందిన అభాగ్యులు బతుకీడుస్తున్నారు. ఆశ్రమంలో ఉన్న వారంతా మనిషికో భాష మాట్లాడే వారు ఉన్నారు. కన్న వారు కాదని వదిలేసిన వారు, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులే భారమని వదిలేసిన వారు, భర్తలు వదిలేసిన మహిళలు, ఎవరు లేక అనాథలుగా రోడ్లపై తిరుగుతున్న వారు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో ధీనగాధే. వీరందరినీ అక్కున చేర్చుకొని.. వారికి ఆత్మీయత పంచుతున్నది సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్. అభాగ్యుల జీవితాలకు వెలుగులు పంచుతున్నది.

2009లో స్థాపన
బాలాపూర్ మండల నాదర్‌గుల్‌లో 2009లో సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథాశ్రమాన్ని రాజేశ్వర్‌రావు స్థాపించారు. 25 మంది వృద్ధులు ద్దులు ప్రస్తుతం ఆశ్రమంలో ఉన్నారు. నెలకు రూ.లక్ష వరకు వెచ్చిస్తూ వారిని పోషిస్తున్నారు. కొంత మంది దాతలు సహకారం అందిస్తున్నారని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఉస్మానియా, గాంధీ దవాఖానల దగ్గర వైద్యం చేయిస్తామని తీసుకొచ్చి వదిలేసిన వారిని హరిశ్చంద్ర ఫౌండేషన్ చేరదీస్తున్నది. పక్షావతం, మూర్ఛ వ్యాధి వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నది. ఇలా మానసిక దివ్యాంగులకు, అనాథలకు, రోగులకు చికిత్స అందిస్తూ రెండు పూటల భోజనం పెట్టి, అన్ని రాకల సేవలు చేస్తున్నదీ ఆశ్రమం. ఎంతో మంది అనాథలకు నీడనిస్తున్నది.

అంతిమ సంస్కారాలు సైతం..
సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌లో ఎవరైనా మరణిస్తే.. అంతిమ సంస్కారాలు నిర్వాహకులే చేస్తున్నారు. నగరంలో ఇప్పటికే 1200 మంది అనాథలకు , రోడ్లపై మరణించిన వారిని కూడా తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో, వడదెబ్బతో తదితర ప్రమాదాల్లో గాయడిన క్షతగాత్రుల ఫొటోలు తీసి వైబ్‌సైట్‌లో పెట్టి వారి కుటుంబాలకు తెలియజేసి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. వందలాది మందిని కాపాడిన చరిత్ర హరిశ్చంద్ర ఫౌండేషన్ వారికి ఉంది.

వంద పడకల ఆశ్రమం ఏర్పాటు చేస్తా
నాదర్‌గుల్‌లో ఎక్కడైనా వంద పడకల ఆశ్రమం నిర్మాణం చేయాలని ఉంది. ఆశ్రమంలో 25 మంది అనాథ వృద్ధులు ఉన్నారు. ఇంకా చాలా మందిని చేరదీయాలని ఉంది. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాం. ప్రతి నెల రూ.లక్ష వరకు ఖర్చు వస్తున్నది. చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు మేమే చేస్తున్నాం. ఇప్పటికి 1200 వందల మందికి అంతిమ సంస్కారాలు చేశాం. మానవ సేవే మాధవ సేవగా భావించిన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.
-రాజేశ్వర్‌రావు,
సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ చైర్మన్

సేవ చేయడం అదృష్టం
ఎంతో మంది అనాథలకు సేవ చేస్తునందకు సంతోషంగా ఉంది. పక్షవాతం వచ్చిన వారు ఉన్నారు. నడువలేని స్థితిలో ఉన్న వారు ఉన్నారు. మంచం పై పడుకోని లేవలేని వారు ఉన్నారు. ఉదయం సాయంత్రం, రాత్రి భోజనం పెడుతున్నాం. వారికి అవసరమైన మందులను ఇస్తున్నాం.
-మంజుల, ఆశ్రమం ఇన్‌చార్జి

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...