సేవాలాల్ సేవలు చిరస్మరణీయం


Sat,February 16, 2019 12:34 AM

రవీంద్రభారతి : తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ప్రోత్సహిస్తూ, గంగా జము నా తహజీబ్‌లా పండుగలు నిర్వహించటం హర్షణీయం అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ 280 జయంతి సందర్భంగా నిర్వహించిన మహాభోగ్ బండారో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్. తండాలను పంచాయతీలుగా చేశారన్నారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సమయంలో కె.సి. ఆర్. ఇచ్చిన హామీలు అమలు చేసి చూపిస్తున్నారన్నారు. గతంలో అన్ని పార్టీలు కేవలం హామీలకే పరిమితం అయ్యాయన్నారు. బంజారాలు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. సేవాలాల్ మహారాజ్ మార్గంలో నడుచుకోవాలని సూచించారు. గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో హైదరాబాద్ ఇన్‌చార్జి కలెక్టర్ రవి గుగులోత్ మాట్లాడుతూ సేవాలాల్ చూపిన మార్గంలో పయనిస్తూ తండాల్లో అభివృద్థికోసం పాటుపడాలన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ గిరిజన లంబాడీల పండుగలు ప్రకృతితో ముడిపడి ఉంటాయన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా పలుతీర్మానాలు ప్రతిపాదించారు.

జాతి కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహామనిషి
ఉస్మానియా యూనివర్సిటీ: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 280వ జయంతిని ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వ హించారు. ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి హాజరుకాగా, అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ - ముంబై, ఐఆర్‌ఎస్ అధికారి జీవన్‌లాల్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సేవాలాల్ జీవిత చరిత్రను వివరించారు. జాతి కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహామనిషి సేవాలాల్ అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ సెల్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రునాయక్, ఆర్ట్స్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్ డాక్టర్ విజయ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధన్‌రాజ్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ హన్మంత్‌నాయక్, ఈసీఐఎల్ పర్సనల్ మేనేజర్ హరినాథ్, ప్రొఫెసర్లు సూర్యాధనుంజయ, శ్రీరాములు పాల్గొన్నారు.

సంత్ సేవాలాల్ గొప్ప సంస్కర్త
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతిని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించారు. హైదరాబాద్ ఇన్‌చార్జి కలెక్టర్ రవి సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తదనంతరం, సేవాలాల్ అందించిన సేవలను వివరించారు. ఇన్‌చార్జి డీఆర్‌వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సేవాలాల్ చూపిన ఆధ్యాత్మిక జీవి తం ఆచరణీయమన్నారు. లా ఆఫీసర్ సం గీత, డిప్యూటీ కలెక్టర్ రాధిక రమణి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డీడీ దావూజీ, కలెక్టరేట్ ఏవో జహురుద్దీన్, సూపరింటెండెంట్లు విజయలక్ష్మీ, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ రెవెన్యూ ఎంప్లాయ్స్ అసొసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టెం సదానంద్, అరుణ్ జైశ్వాల్, శ్రీరామ్, వెంకటేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...