ప్రతి జోన్‌కు మూడు మేజర్ థీమ్ పార్కులు


Fri,February 15, 2019 01:14 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీకి చెందిన ఖాళీ స్థలాల్లో కొత్తగా మరో 20వరకూ మేజర్ పార్కులను అభివృద్ధిచేయాలని బల్దియా స్థాయీసంఘం తీర్మానించింది. దీనికి సంబంధించి వారం రోజుల్లో నివేదిక రూపొందించాలని సభ్యులు అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఆధీనంలోని ఖాళీ స్థలాల్లో సుమారు 20 నుంచి 25 స్థలాలు మూడు నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, అందులో ప్రతి జోన్‌కు కనీసం మూడు చొప్పున థీమ్ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయిస్తూ తీర్మానించారు. గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన స్థాయీసంఘం సమావేశంలో పలు తీర్మాణాలు చేశారు.

స్థాయీ సంఘం తీర్మానాలు
- అంబర్‌పేట ఛే నంబర్ జంక్షన్ నుంచి కాలా బ్రిడ్జీ వరకు రూ.3.85కోట్లతో వరదనీటి డ్రెయిన్ నిర్మాణం
- బతుకమ్మకుంట నుంచి ఛే నంబర్ వరకు రూ.5.20కోట్లతో వరదనీటి డ్రెయిన్ నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం
- మోజంజాహీ మార్కెట్‌లో చికెన్, మీట్ మార్కెట్‌ల పునరుద్ధరణ, ఫ్లోరింగ్, జాక్ ఆర్చ్ సీలింగ్‌ను రూ.5.80కోట్లతో నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం
- ఈ-ఆఫీసు నిర్వహణలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్‌లు, సీనియర్ ప్రోగ్రామర్ల సేవలను మరో సంవత్సరం పాటు పొడిగింపు
- పారిశుధ్య కార్యక్రమాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) సాంకేతిక సహకారాన్ని పొందాలని నిర్ణయం
- ఐవీడీఎం విభాగంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఐదు ప్యాకేజీలకింద నిర్ణయిస్తూ టెండర్లు ఆహ్వానించే ప్రతిపాదనకు ఆమోదం
- సర్కిల్-9లోని మొఘల్‌పురాలో రూ.4.5 కోట్లతో ఆర్‌సీసీబాక్స్ డ్రైన్ నిర్మాణానికి తీర్మానం.
- ఓల్డ్ ముంబాయి హైవే(లెధర్ పార్క్) నుంచి రోడ్ నం-45 వరకు హెచ్‌టీ లైను కింద 30మీటర్ల వెడల్పు రోడ్డు విస్తరించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం తీర్మానం
- న్యాయవాది రాజా చంద్రశేఖర్‌గౌడ్‌ను ఓఎస్‌డీ(లీగల్)గా నియమిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 2020 జనవరి వరకు నియమించడంతోపాటు నెలకు రూ.75000 వేతనం, వాహన సౌకర్యం కల్పిస్తూ తీర్మానం
- ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న వివిధ రకాల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెండు కేటగిరీలుగా నిర్ణయిస్తూ తీర్మానం

- రెవిన్యూ విభాగం అదనపు కమిషనర్ వద్ద ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ వరకూ నిర్ణయిస్తూ నెలకు రూ. 30వేల వేతనం ఖరారుచేశారు.
- చెరువుల పరిరక్షణకు ఏర్పాటుచేసిన 329మంది లేక్‌గార్డ్స్ వేతనాలకు రూ.5.32కోట్లు చెల్లించే ప్రతిపాదనకు ఆమోదం
- న్యాక్ ద్వారా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించిన 100 మంది సివిల్ ఇంజినీర్ల సేవలను మరో ఏడాదిపాటు పొడిగింపు
- జవహర్‌నగర్ డంప్‌యార్డు నుంచి మల్కాపురం చెరువులోకి వెలువడే కాలుష్య జలాలను శుద్ధిచేసేందుకు రూ.11కోట్లతో రెండు వేల కేఎల్‌డీ సామర్ధ్యంగల మొబైల్ ఆర్వోల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం
- రూ. 5.18 కోట్లతో ఉప్పుగూడ ఆర్‌యూబీ వద్ద సర్వీసు రోడ్డు, ఫుట్‌పాత్, వరదనీటి డ్రెయిన్ నిర్మాణానికి తీర్మానం
- మిథానీ జంక్షన్ నుంచి ఒవైసీ ఆసుపత్రి జంక్షన్ వరకు నిర్మించనున్న ైఫ్లెఓవర్‌కు సర్వీస్ రోడ్డును లకా్ష్మరెడ్డి గార్డెన్ నుంచి ఒవైసీ ఆసుపత్రి వరకు రూ.5.85కోట్లతో నిర్మించే తీర్మానానికి ఆమోదం

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...