ఆక్సిజన్ పార్కులో ప్రేమ జంటకు పెండ్లి


Fri,February 15, 2019 01:13 AM

మేడ్చల్, నమస్తే తెలంగాణ : ప్రేమికుల రోజున ఓ ప్రేమ జంటకు బలవంతంగా కొంత మంది పెండ్లి చేసిన ఘటన మేడ్చల్‌లో సంచలనం రేకెత్తించింది. మేడ్చల్ మండలం కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కులో సరదాగ గుడుపుతున్న యువ జంటకు యువకులు పెండ్లి చేశారు. ఈ పెండ్లి తతంగాన్ని వీడియో తీసి ప్రచార మాంద్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారి హల్‌చల్ సృష్టించింది. వీడియో ఆధారంగా అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఏసీపీ శ్రీనివాస్‌రావు మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

అల్వాల్ సూర్యనగర్ కాలనీ, వేంకటేశ్వర్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న యువతి (19) కండ్లకోయ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నది. సిద్దిపేట ప్రాంతానికి చెందిన వీరి దూరపు బందువుతో కలిసి కళాశాల సమీపంలో ఉన్న ఆక్సిజన్ పార్కులో గురువారం విహరిస్తున్నది. గురువారం ప్రేమికుల రోజు కావడంతో పార్కులోకి కొంతమంది యువకులు ప్రవేశించి అక్కడున్న ఈ జంటకు బలవంతంగా వివాహం జరిపించారు. వివాహ అనంతరం ఆ తంతును వీడియో తీసి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు. వెంటనే వార్త వైరల్‌గా మారి వివిధ ప్రసార మాద్యమాల్లో దావానంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ సంఘటపై సైబరాబాద్ సీపీతో డీసీపీ పద్మజ, ఏసీపీ శ్రీనివాస్‌లు అప్రమత్తమై నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా ప్రచార మాద్యమాల్లో వస్తున్న ఈ విషయాన్ని తెలుసుకున్న యువతి తండ్రి వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులపై మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పెండ్లి చేయించిన వ్యక్తులను వీడియో ఆదారంగా గుర్తించిన పోలీసులు మేడ్చల్‌కు చెందిన బీఎస్‌పీ నాయకుడు మొలంగిరి శ్రీహరిచారీతో పాటు కుల్చల ఆనంద్, కానుగంటి అవినాశ్, పిట్ల అశోక్, బర్ల సురేశ్ కుమార్, తాళపురం చంద్రశేఖర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమావేశంలో మేడ్చల్ సీఐ గంగాధర్, అల్వాల్ సీఐ మట్టయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...