తొలి విడుత పంచాయతీ పోరు నేడే


Mon,January 21, 2019 01:09 AM

- మేడ్చల్ జిల్లాలో 33 గ్రామాల్లో ఎన్నికలు
- ఉదయం పోలింగ్ సాయంత్రం ఫలితాలు
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: తొలి విడుత పంచాయతీ ఎన్నికలు నేడు జరుగనున్నాయి.మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసర, శామీర్‌పేట్ మండలాల పరిధిలోరని 33 గ్రామాల్లో నేడు పొలింగ్ జరుగనుంది. పంచాయతీ ఎన్నికలకు పటిష్టంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి ఆధ్వర్యంలో అధి కారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జిల్లాలో శామీర్‌పేట్ మండల పరిధిలోని మూడుచింతలపల్లి, నాగిశెట్టిపల్లి, మాదారం గ్రామాలు, కీసర మండల పరిధి లోని నర్సంపల్లి గ్రామం సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 40 వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. కాగా మిగిలిన 29 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు, 33 గ్రామాల్లో వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగ నున్నాయి. ఈ 29 సర్పంచ్ స్థానాలకు మొత్తం 111 మంది సర్పంచ్ అభ్య ర్థులు, 322 వార్డు స్థానాలకు 916 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా తొలి విడుత ఎన్నికలు జరుగనున్న 33 గ్రామాల్లో 322 (కీసర-106, శామీర్‌పేట్-216) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 987 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరితో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. విధులు నిర్వహించనున్న ఉద్యోగులకు ఆదివారం సాయంత్రం కీసర, శామీర్‌పేట్ ఎంపీడీవో కార్యాల యాల వద్ద పోలింగ్ కేంద్రాల వారిగా నియమించిన అధికారులకు పోలింగ్ సామాగ్రిని అందించారు.

సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌటింగ్ షురూ అవుతుంది. ఒకే రోజున ఉదయం పోలింగ్, మధ్యాహ్నం ఫలితాలు వెల్లడి అవు తున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...