హైదరాబాద్ హోప్స్..


Mon,January 21, 2019 01:08 AM

- చిన్నారులకు ఫొటోగ్రఫీ పోటీలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చిన్నారుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు నగరంలో ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నారు. 9 నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న బాలబాలికలు పాల్గొనేందుకు అర్హులుగా నిర్ణయించారు. నగర అందాలతోపాటు అభివృద్ధికి సంబంధించిన ఫొటోలతో పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. హైదరాబాద్ హోప్స్ 2019 పేరిట లిబరేట్ ఏ యోగా స్టూడియో ఫర్ ఉమెన్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులోభాగంగా పార్కులు, ప్లేగ్రౌండ్‌లు, వీధులు, హౌసింగ్, మెట్రోరైలు, స్మార్ట్‌సిటీ, తదితర అంశాలపై ఫొటోలు ఉండాలని నిర్వాహకులు తెలిపారు. ఫొటో ఎంట్రీలు పంపించేందుకు 31వ తీదీని గడువుగా నిర్ణయించామన్నారు.. ప్రవేశ రుసుము రూ.200 చెల్లించాల్సి ఉంటుందని, ఎంట్రీల్లో ఉత్తమమైన వాటిని ఫిబ్రవరి16న ఫీనిక్స్ ఏరినాలో ప్రదర్శనకు ఉంచుతామన్నారు. ఒకొక్కరూ మూడు ఎంట్రీలను https;//www.liberatetdu.com/utsaahaకు పంపించాలన్నారు. వివరాలకు 7893944788,8019694594 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...