డిజైన్ 2 సాల్వ్..


Mon,January 21, 2019 01:07 AM

దుండిగల్: వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో డిజైన్ 2 సాల్వ్ అనే అంశంపై ప్రారంభమైన నిర్విరామ సదస్సు ఆదివారం ఉదయం ముగిసింది. 36 గంటల పాటు ఏకధాటిగా కొనసాగిన ఈ సదస్సులో రెండు తెలుగు రాషాల్లోని వివిధ కళాశాలకు చెందిన 120 మంది విద్యార్థులు 36 జట్లుగా విడిపోయి తమ ప్రతిభను చాటారు.మెజనైన్ టెక్నాలజీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌అనే ఇతివృత్తంతో కొనసాగిన ఈ హ్యాకథాన్‌లో డిజిటల్ అగ్రికల్చర్,హెల్త్, టెలీమాటిక్స్,ఫైనాన్షియల్ టెక్నాలజీ, సైప్లె చెయిన్ మేనేజ్‌మెంట్ అనే ఐదు విభాగాలపై పోటీలు నిర్వహించారు. వివిధ రంగాల్లో నిపుణులైన రాయసం శ్రీధర్, అచ్యుత రాజేశ్, ముల్పూర్ అనురాధ, షేక్ అబ్దుల్ ముజీబ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.నగరంలోని బీవీఆర్‌ఐటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ప్రత్యూష, ప్రణూష, హరిణి, పూజిత జట్టు ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. విజ్ఞానజ్యోతి సంస్థ అధ్యక్షుడు డా.డీఎన్‌రావు , కళాశాల సంచాలకులు డా.చెన్నకేశవరావు, హ్యాకథాన్ సమన్వయకర్త డా.చక్రవర్తుల కిరణ్, ఐడీయా ల్యాబ్స్ ఎండీ పంకజ్‌దివాన్ పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...