సమాజానికి దోహదపడేలా ఆవిష్కరణలుండాలి


Sun,January 20, 2019 12:22 AM

దుండిగల్: సాంకేతిక విద్యలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులకు అనుగుణంగా విద్యాసంస్థలు,అధ్యాపకులు విద్యార్థులకు తగిన పరిష్కారం చూపుతూ వినూత్న పద్ధతుల్లో సమాజ వికాసానికి దోహదపడే ఆవిష్కరణలను చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం అన్నారు. నగరశివారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిలక్ష్మణ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ కళాశాలలో‘ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐఎస్ విద్యాసంస్థల’ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, జేఎన్ వీసీ,ప్రొఫెసర్ వేణుగోపాల్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ ఎస్.రామచంద్రం మాట్లాడుతూ సాంకేతిక విద్యలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులు, విద్యాసంస్థలు కొత్త తరహాలో ముందుకెళ్లాలన్నారు. జేఎన్ వీసీ, ప్రొఫెసర్ వేణుగోపాల్ మాట్లాడుతూ చక్కని కార్యక్రమాలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి మర్రిరాజశేఖర్ , ‘ఐఎస్ తెలంగాణ రాష్ట్రశాఖ కార్యదర్శి ప్రొఫెసర్ వై.పద్మసాయి,ఎంఎల్ విద్యాసంస్థల చైర్మన్ మర్రిలక్ష్మణ్ ఎంఎల్ కళాశాల ప్రిన్సిపల్ డా. శ్రీనివాస్ డా. రాధికాదేవి, డా.కిరణ్ డా.గుప్తా, డా.నర్సింహరావు, అకడమిక్ డీన్, ప్రొఫెసర్ చుగ్ తదితరులు పాల్గొన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...