నేటి నుంచి ‘స్వచ్ఛ’సర్వే


Sat,January 19, 2019 01:04 AM

-‘సాఫ్ హైదరాబాద్... షాన్ హైదరాబాద్’ జీహెచ్ సరికొత్త నినాదం
-స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాల రాక
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : స్వచ్ఛతలో ర్యాంకుల కేటాయింపునకు ఉద్దేశించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2019 సర్వే శనివారం నుంచి నగరంలో జరుగనున్నది. కేంద్ర స్వచ్ఛభారత్ మిషన్ చెందిన స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడ అమలవుతున్న స్వచ్ఛ కార్యక్రమాలను పరిశీలిస్తాయి. 4 తేదీ నుంచి దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం మొదలైన విషయం విదితమే. ఈనెల 31వ తేదీవరకు ఈ సర్వే జరుగనున్నది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ఆయా ఏజెన్సీలకు చెందిన బృందాలు దేశవ్యాప్తంగా నాలుగువేల పైచిలుకు పట్టణాలు, నగరాల్లో పర్యటిస్తూ పారిశుధ్యం, మరుగుదొడ్లు తదితరవాటి నిర్వహణను పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో ఈనెల 19న ఈ బృందాలు మన నగరానికి వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో స్వచ్ఛతను పరిశీలించిన అనంతరం వారు జీహెచ్ కమిషనర్ సమావేశమయ్యే అవకాశమున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంగా జీహెచ్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి వివరిస్తారు. ఈ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా స్వచ్ఛభారత్ మిషన్ ఆయా నగరాలకు ర్యాంకులను కేటాయిస్తుంది. మరోవైపు, స్వచ్ఛ సర్వేక్షణ్ మెరుగైన ర్యాంకు సాధించే లక్ష్యంతో జీహెచ్ గత కొంత కాలంగా పారిశుధ్యం, మరుగుదొడ్లు, నాలాలు, ఫుట్ డెబ్రిస్, రోడ్లు తదితర అంశాలను ప్రధాన దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ‘సాఫ్ హైదరాబాద్.. షాన్ హైదరాబాద్’ పేరుతో సరికొత్త నినాదాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే ఆరునెలల్లో స్వచ్ఛ కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగించాలని నిశ్చయించారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...