అక్రమ లే ‘ఔట్’..!


Sat,January 19, 2019 12:59 AM

-అనధికారిక నిర్మాణాలపై ముప్పేట దాడి
-సంస్థ పరిధిలో 545 గుర్తింపు
-అనుమతి లేదు.. ఆపై హెచ్ లోగో ప్రచారంతో అమ్మకాలు
-తుర్కపల్లిలో వెలుగుచూసిన అక్రమ ‘రియల్’ దందా
- సదరు సంస్థపై తొలిసారిగా రెరా, కమిషనరేట్ అధికారుల ఫిర్యాదు
-అక్రమ నిర్మాణాల నియంత్రణలో కీలక నిర్ణయం
-అనుమతి ఉన్న ప్రాజెక్టులోనే కొనుగోలు చేయాలని సూచన
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అనధికారిక భవన, లే అవుట్ల నియంత్రణలో హెచ్ కీలక నిర్ణయం తీసుకున్నది. స్థానిక సంస్థలను సమన్వయం చేస్తూ అక్రమ నిర్మాణాలపై నోటీసులు జారీ చేయడం, కూల్చివేతలు జరుపుతూ వచ్చిన హెచ్ అధికారులు తాజాగా అనుమతి లేకుండా భవనాలు, లే అవుట్లు చేస్తున్న రియల్టర్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే హెచ్ అనుమతి లేకుండా సంస్థ లోగోతో ప్లాట్లుగా చేసి అమ్మకాలు జరుపుతున్న రియల్టర్లే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు హెచ్ అధికారులు తొలిసారిగా అక్రమ లే అవుట్ చేసిన రియల్టర్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా), స్థానిక పోలీస్ కమిషనరేట్ ఫిర్యాదు చేశారు. శామీర్ మండలం పరిధిలోని తుర్కపల్లిలోని సర్వే నంబర్లు 594, 595, 596, 597, 613, 614, 615, 616, 617లలోని 53ఎకరాల్లో చంద్రా గ్రూప్ సంస్థ లే అవుట్ ఏర్పాటు చేశారు. మాస్టర్ 2031 నిబంధనల ప్రకారం సదరు భూమి కన్జర్వేషన్ జోన్ ఉంది. దీనిని రెసిడెన్షియల్ జోన్ మార్చుకొని హెచ్ అనుమతి తీసుకుని లే అవుట్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

కానీ సదరు చంద్రా గ్రూప్ సంస్థ హెచ్ అనుమతి లేకుండా ఏకంగా సంస్థ లోగోతో బ్రోచర్ ఏర్పాటు చేసుకొని ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సదరు సంస్థ అక్రమంగా లే అవుట్ చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు హెచ్ దృష్టికి రావడంతో ప్లానింగ్ విభాగం డైరెక్టర్-2 శ్రీనివాస్, జోనల్ అధికారులు తుర్కపల్లిలోని సదరు లే అవుట్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చంద్రా గ్రూప్ ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో పాటు లోగోను వాడుకోవడం చట్ట విరుద్ధమని తేల్చారు. ఈ విషయాన్ని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ ఇన్ కమిషనర్ అరవింద్ నివేదిక అందించారు. అరవింద్ ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్దంగా లే అవుట్ చేసిన రియల్టర్ చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు సదరు సంస్థకు నోటీసులు జారీ చేయడంతోపాటు మొట్టమొదటి సారి రియల్టర్ చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, రెరాలో ఫిర్యాదు చేశారు.

అక్రమ నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్
గడిచిన కొద్ది రోజులుగా సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాల గుర్తింపునకు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అనధికారిక నిర్మాణాలపై సంస్థ ఆన్ ఫిర్యాదులతోపాటు ప్రత్యేక కౌంటర్ నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అక్రమ నిర్మాణమని తేల్చుతూ సదరు నిర్మాణదారుడికి హెచ్ నోటీసులు జారీ చేస్తున్నది. స్థానిక సంస్థ గ్రామ పంచాయతీ, పోలీసుల సహకారంతో నోటీసులకు స్పందించని నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని రోజులుగా అక్రమంగా ఏర్పాటు చేసిన భవనాలు, లే అవుట్ గుర్తించేందుకు అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఈ మేరకు ఇప్పటి వరకు సంస్థ నాలుగు జోన్ల పరిధిలో 545(భవన, లే అవుట్)లు నిర్మాణాలు అనుమతి లేకుండా ఉన్నాయని తేల్చి వీటికి నోటీసులు అందజేశారు. వీటిని నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కొనుగోలుదారులు హెచ్ అనుమతి ఉన్న సంస్థలోనే కొనుగోలు చేయాలని ప్లానింగ్ డైరెక్టర్లు బాలకృష్ణ, శ్రీనివాస్ తెలిపారు. రెరా యాక్ట్ అందుబాటులోకి వచ్చిందని, కొనుగోలు చేసే ముందు రెరాలో సంబంధిత ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నదా? లేదా అన్నది తెలుసుకొని కొనుగోలు చేసుకోవాలని సూచించారు.

299
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...