30 మంది మించి ఉంటే.. ప్రత్యేక విచారణ


Fri,January 18, 2019 12:10 AM

- కాలేజీలు, మాల్స్‌లో ఓటరు నమోదుకు డ్రాప్ బాక్సులు
- జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ జిల్లాలో ఒకే ఇంటి నెంబర్‌పై 30 ఓట్ల కన్నా అధికంగా ఉన్న ఓటర్లపై ప్రత్యే కంగా విచారణ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ తెలిపారు. హైదరాబాద్‌లో నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవ రణ తదితర అంశాలపై ఓటరు నమోదు అధికారులు, సూపర్ వైజర్లు, ప్రత్యేక అధికారులతో దానకిశోర్ సమీక్ష నిర్వహిం చారు. అడిషనల్ కమిషనర్లు ఆమ్రపాలి కాట, అద్వైత్ కుమా ర్‌సింగ్, కెనడి, హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ రవి తది తరులు పాల్గొన్న సమావేశంలో దానకిశోర్ మాట్లాడారు. అధిక ఓటర్లు ఉన్న ఇండ్లలో మరోసారి తహసీల్దార్లతో పరిశీలించ నున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుకై అన్ని పోలింగ్ లొకేషన్లలో జనవరి 23, 24,25 తేదీలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతీపోలింగ్ కేంద్రాల్లో పేర్కొన్న తేదీలలో పోలింగ్ బూత్‌స్థాయి అధికారులు సాయంత్రం 4 గంటల నుం చి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలి పారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ నెల 20వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

స్సెఫల్ కాంపేన్ డేలో బీఎల్‌ఓలు సాయంత్రం ఆరుగంటల నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారని అన్నారు. జిల్లాలోని 84మున్పిపల్ వార్డులలోని వార్డు కార్యాలయాల్లో క్లేయిమ్‌లు,నూతన ఓటర్ల దరఖాస్తులను తీసుకోవడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించామని తెలిపారు.2019 జనవరి 1వ తేదీనాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ నూతన ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ప్రతీవార్డు కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఇంటర్నెట్ సదుపాయంతో జనవరి 25వ తేదీ వరకు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఒకే వ్యక్తి అధిక సంఖ్యలో ఓటర్ల వివరాలతో నమోదు చేయడానికి తీసుకువస్తే అంగీకరించడం జరుగదని చెప్పారు. జిల్లాలోని అన్ని డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలో 18 సంవత్సరాలు నిండినవారినిఓటర్లుగా నమోదు చేయడానికి ఈఆర్‌ఓలు ప్రత్యేక చైతన్య సమావేశాలను నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవాలని సూచించారు.ప్రతీ డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలో, నగరంలోని మాల్స్‌లో నూతన ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించడానికి ప్రత్యేకంగా డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డ్రాప్ బాక్స్‌లలో నూతన ఓటర్ల నమోదుకు దరఖాస్తులు వేయడానికి జనవరి 20వ తేదీవరకు ఏర్పాట్లు ఉంటాయని అన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...