ఔటర్‌పై చెత్తవేస్తే జరిమానా


Fri,January 18, 2019 12:09 AM

సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ : ఔటర్‌రింగ్‌రోడ్డుకు ఇరువైపులా పచ్చదనాన్ని పెంపొందించాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకూ ఓఆర్‌ఆర్ మీద పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్ విమానాశ్రయం మార్గంలో ఉన్నట్లే గచ్చిబౌలి నుంచి శంషాబాద్ రూటును పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ మార్గాన్ని చూపరులను ఆకట్టుకునేలా సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా మొక్కలు పెంచాలని, కొద్ది రోజుల వ్యవధిలోనే టోల్‌గేట్ పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. అధికారులు క్రమం తప్పకుండా ఈ మార్గంలో పర్యటిస్తూ అతిసుందరంగా ఉండేలా శ్రద్ధ వహించాలన్నారు. ప్రతిరోజూ విధిగా ఓఆర్‌ఆర్ ప్రధాన మార్గాన్ని శుభ్రపర్చాలని, ఎప్పటికప్పుడు చెత్తను తొలిగిస్తూ రోడ్డును మెరుగ్గా నిర్వహించాలని తెలిపారు. చెత్తచెదారం, పాత సామన్లు, మట్టిని పారబోసే వ్యక్తుల నుంచి జరిమానా వసూలు చేయాలని ఆదేశించారు. ఓఆర్‌ఆర్ మధ్యభాగంలో సైనేజీలున్న చోట గల చెట్లను నిత్యం కత్తిరించాలని చెప్పారు. టోల్‌ప్లాజా ఆపరేటర్లకు ఆయన పలు సూచనలు చేశారు. ఆయన వెంట హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ శ్రీనివాస్, ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...