వయోధిక పాత్రికేయులకు అండగా నిలుస్తాం


Thu,January 17, 2019 01:30 AM

ఖైరతాబాద్: వయోధిక పాత్రికేయులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ పాత్రికేయులు ఎన్. గణేశన్ ఏడు దశాబ్దాల ఆయన పాత్రికేయ వృత్తిలో అనుభవాలు, జ్ఞాపకాలను విలేకరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సంఘం అధ్యక్షులు వరదాచారి అధ్యక్షత వహించగా, అల్లం నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వయోధిక పాత్రికేయులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ ఫలాలు వర్తించేలా తన వంతు కృషి చేస్తానన్నారు. వారి మేధస్సును, అనుభవాలను భావి జర్నలిస్టులకు ఉపయోగపడే విధంగా చొరవ చూపాలన్నారు. సీనియర్ పాత్రికేయులు ఎన్. గణేశన్ మాట్లాడుతూ 1948లో మొదటి సారి న్యూ ఎరా పత్రికలో తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించానని, 1950లో దక్కన్ క్రానికల్, 1953లో ది హిందూ పత్రికల్లో పనిచేశానన్నారు. తన పదవీ విరమణ అనంతరం దక్కన్ క్రానికల్‌లో ప్రతి వారం ఓ కాలమ్ రాసేవాడినని, అలాగే పేట్రియాట్ (ఢిల్లీ), మున్సిఫ్, న్యూ ఇండియా టైమ్స్ పత్రికల్లో సైతం అనేక వ్యాసాలు రాశానన్నారు. అలాగే క్రీడలపై అనేక కథనాలు, వార్తలు, వ్యాసాలు రాశానన్నారు. వయోధిక పాత్రికేయ సంఘం నాయకులు ఉడయవర్లు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...