ప్రవచనాలతో మాయ...


Tue,January 15, 2019 05:53 AM

-మాటల మాంత్రికుడు గిరీశ్ సింగ్ కస్టడీ విచారణలో కొత్త కోణాలు
-విలాసాలకు కోట్లు ఖర్చు!
-శ్రీలంకలో దోస్తు బర్త్‌డే దావత్
-మోజు తీరడంతో కోటి నష్టానికి కారు విక్రయం
-మలేషియాలో అరటి తోటలు..
-ఆఫ్రికా దేశాల్లో బంగారం గనులంటూ మాయ
-మాటలతో రాబట్టిన రూ.60 కోట్ల పెట్టుబడులు
-రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 5 కేసులు నమోదు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆధ్యాత్మిక ప్రవచనాల పేరుతో నమ్మించి... కోట్లు కొల్లగొట్టిన మాటల మాంత్రికుడు గిరీశ్‌సింగ్ బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో అరస్టైన గిరీశ్‌సింగ్‌పై కొత్తగా మరో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గిరీశ్‌సింగ్ మోసంపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు... అనేక కొత్త కోణాలు తెలి శాయి. ఆఫ్రికా దేశాల్లో బంగారపు గనుల బిజినెస్, మలేషియాలో 2వేల ఎకరాల్లో అరటి తోట వ్యాపారం అంటూ నిమ్మించగా... కొందరు భక్తులుగా చేరి సభ్యులుగా మారి న వారి నుంచి కోట్లు దండుకున్నాడు. ఇతని ప్రవచనాల మాయలో పడ్డ చాలా మంది భక్తులు ఇంకా తమ గురువు డబ్బులు తిరిగి ఇస్తాడనే ఊహలో ఉండడం గమనార్హం.

పోలీసులు విచారణను పరిశీలిస్తే .. గిరీశ్‌సింగ్ సేకరించినట్లు అనుమానిస్తున్న రూ.60 కోట్లు అంతా ఖర్చు పెట్టేశాడని, అతని వద్ద ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదని స మాచారం. గత నెల డిసెంబర్ 24న నెల్లూరుకు చెందిన ఐద్వెత్త స్పిరిచ్యూవెల్ రీచార్జి సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సంస్థ ను నిర్వహిస్తున్న గిరీశ్‌సింగ్‌ను, అతని సోదరుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక ప్రవచనాలతో అతని వద్ద చేరిన భక్తులను డ్రీమ్ బ్రిజ్ సోషల్ ట్రేడ్ సంస్థ పేరుతో ప్రారంభించిన మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంలో పెట్టుబడులు పెట్టించి మోసం చేసిన భాగోతం బయపడిన విషయం అందరికీ తెలిసిందే. అతన్ని 7 రోజుల కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులకు... గిరీశ్ మాటల మాయగాడని, పలు పుస్తకాలను చదివి, ఐద్వెత్త ప్రక్రీయల పేరుతో చాలా మందిని మాయ చేశాడని తేలింది.

మాటలతో... మాయ లో పడేశాడు
మనం ఒక రిక్షవాడి కుటుంబంలో జన్మించవచ్చు... ఒక భిక్షాటన చేసే దంపతులకు పుట్టవచ్చు.. ఈ పుట్టుకను మనం నిర్ణయించలేం... కానీ చనిపోయేటప్పుడు కోటీశ్వరులుగా ఉండేలా మనం నిర్ణయించుకోవచ్చు. బతికినం తా కాలం బిలినీయర్‌గా బతకాలని ఆకాంక్షించుకోవా లి...ఇలా వేలాది ప్రవచనాలను గిరీశ్ సింగ్ చెప్పి.. వెయ్యి మంది సభ్యులను చేర్చుకుని తన మాయలో పడేశాడు. మీరు అనుకోండి.. అది జరిగిపోతుంది. గట్టిగా అనుకోం డి... మీరు కోరుకునేది మీ ముందు కనపడుతుంది... .ఈ మాటలకు సభ్యులు భక్తితో ఊగిపోవడంతో వారి బలహీనతను పసిగట్టి మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంను తెరపైకి తెచ్చాడు.

పెట్టుబడి పెట్టకపోతే... చచ్చిపోండి
డ్రీమ్ బ్రిజ్ సోషల్ ట్రేడ్‌లో పెట్టుబడులు పెట్టడం మీకు ఓ అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని కోల్పోతే మీరు జీవితంలో ఇక ఏమి సాధించలేరు. అప్పు చేసైనా సరే, ఆస్తులు అమ్ముకోనైనా సరే, ఇంకా ఏమి చేసైనా సరే డబ్బు ను ఇందులో పెట్టండి. నెల రోజుల్లో కోటీశ్వరులు అవం డి... నేను దీవిస్తున్నా అంటూ ప్రవచనాలు, ఐద్వెత్త ప్రక్రీ య ప్రసంగాల కార్యక్రమాల్లో గిరీశ్ సింగ్ అందరికీ నూరిపోశాడు. మీరు ఇందులో పెట్టుబడులు పెట్టుకోలేకపోతే కరెంట్ ప్లగ్‌లో నీళ్లు పోసుకుని... అందులో వేలు పెట్టి చచ్చిపోండని గదమాయించేవాడని... విచారణలో పలువురు భక్తులు చెప్పిన విషయం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విధంగా సభ్యుల వద్ద నుంచి రూ.4 వేల నుంచి రూ.4 కోట్ల వరకు వసూలు చేశాడు.

కొల్లగొట్టిన డబ్బులతో విలాసాలు
గిరీశ్ సింగ్ మాటలు నమ్మి... సభ్యులు డ్రీమ్ బ్రిజ్ సోషల్ ట్రేడ్ మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంలో చేరడంతో కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయి. దీంతో ఆ డబ్బుతో అతను ఎంజాయ్ చేసిన విలాసాలు... దర్యాప్తు అధికారులు మైం డ్‌ను బ్లాక్ చేశాయి. డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియక... అతని ప్రధాన అనుచరుడి జన్మదిన వేడుకలను శ్రీలంకలో జరిపాడు. దీని కోసం దాదాపు 20 మందికిపైగా స్నేహితులను విమానంలో అక్కడికి తీసుకువెళ్లి శ్రీలంకలోని స్టార్ హోటల్స్‌లో విందు, వినోదాలను జరిపారు. మలేషియాలో నాలుగు తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు దాదాపు నెల రోజుల పాటు తిరగాడు. అతని వివాహానికి హైదరాబాద్ శివారులోని ఓ ఫిలిం సిటీలో మూడున్నర కోట్లు ఖర్చుచేశాడు. రూ.3.50 కోట్లకు రోల్స్ రాయ్స్ కారును కొనుగోలు చేసి... మోజు తీరిపోయందని కోటి తక్కువకు రూ.2.50 కోట్లకు అమ్మేశాడు. ఇదే విధంగా మరికొన్ని ఖరీదైన కార్లను కూడా అధిక ధరలకు కొనుగోలు చేసి... వాటిని తక్కువ ధరకు అమ్మేసి సేకరించిన నగదును దుర్వినియోగం చేశాడు. అతను నిర్వహించిన ఐద్వెత్త స్పిరిచ్యూవెల్ రీచార్జి సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ, డ్రీమ్ బ్రిజ్‌కార్యాలయానికి నెలకు రూ.22 లక్షల అద్దెను చెల్లించాడు. సభ్యులను నమ్మించేందుకు మాదాపూర్ ప్రాంతంలోని ఓ కన్వెన్షన్‌లోదాదాపు రూ.40 లక్షలు ఖర్చుపెట్టి ప్రపంచ సమ్మిట్‌ను నిర్వహించాడు.

బంగారం గనులంటూ బురిడీ...
ఇలా... వసూలు చేసిన డబ్బు అంతా ఖైర్చెపోతూ దివాళ పరిస్థితికి చేరుకోవడంతో.... సభ్యులను నమ్మించేందుకు ఆఫ్రికాలో బంగారం గనులను తీసుకుంటున్నాను... దానికోసం గనాతో పాటు మరికొన్ని దేశాలు తిరిగానని వీడియోలు, ఫొటోలతో మాయ చేశాడు. మరో సందర్భంలో మలేషియాలో వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల్లో అరటి తోటలను పెంచుతున్నట్లు ఆశపుట్టించాడు. ఈ వ్యాపారం లో మన పెట్టుబడులను పెడుతున్నానని త్వరలో ఇవి వెయ్యి శాతానికి పెరిగి మనమందరం కోటీశ్వరులైపోతామని క్లాసులతో బోల్తా కొట్టించాడని గిరీశ్‌సింగ్, అతని సోదరుడు దిలీప్‌సింగ్‌ల నుంచి ఆధారాలు సేకరించారు. నెల్లూరులో ఉన్నప్పుడు బాల త్రిపురదేవి ఆలయంలో పని చేసిన అనుభవం, యూట్యూబ్‌లోని పలు వీడియోల స్ఫూర్తి, ఐద్వెత్త ప్రక్రీయల అభ్యసం, లా ఆఫ్ గ్రావిటేషన్, థి మాంక్ హూ సోల్డ్ ఈజ్ ఫెరారీ, డ్రీమ్ హై వంటి పుస్తకాలను చదవడంతో అతనిలో కలిగిన ఆత్మ విశ్వాసం, మ ధ్య తరగతి కుటుంబ జీవనశైలి అనుభవం, వారి ఆశలు, సంపన్న వర్గాల్లో భక్తిపై ఉన్న నమ్మకం అంశాలను అధ్యయనం చేసి.. వారిని ఆకట్టుకునే విధమైన ప్రవచనాలతో అందరినీ ఆకర్షించినట్లు తెలిసింది.


బాధితులు ఉంటే ఫిర్యాదు చేయండి
అధ్యాత్మిక ప్రవచనాలతో భక్తులను మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంలో సభ్యులుగా చేర్చి కోట్లు కొల్లగొట్టిన గిరీశ్‌సింగ్‌పై బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలి. ఇప్పటికీ అతనిపై మొత్తం ఐదుగురు ఫిర్యాదు చేశారు. ఇంకా చాలా మంది సభ్యులు తీసుకున్న డబ్బు చెల్లిస్తాడని అపోహలో ఉన్నారు. మోసానికి సంబంధించిన ఆధారాల సేకరణలో 70 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నాం. అతని విలాసాల ఖర్చుల చిట్టాను సేకరించాం. గిరీశ్ సింగ్‌కు భయపడాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు ఇస్తే అతనికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి మాయగాళ్లు మ రోసారి మోసం చేయకుండా ఉంటుంది. మీ చుట్టూ ఇలాంటి వారు ఉంటే రాచకొండ వాట్సాప్ రూ.9490617111కు సమాచారం ఇవ్వండి.
- నాగరాజు, డీసీపీ రాచకొండ క్రైం విభాగం

231
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...