గాలిపటం కోసం వెళ్లి...


Tue,January 15, 2019 05:51 AM

-భవనంపై నుంచి పడి బాలుడు మృతి
మెహిదీపట్నం : తెగిపోయి వస్తున్న పతంగిని పట్టుకోవడానికి వెళ్లి... భవనం మూడో అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి బాలుడు దుర్మరణం చెందాడు. హబీబ్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. మల్లేపల్లి జాఫర్‌షాగ్రౌండ్ ప్రాంతంలో నివసించే సయ్యద్ ఓబేద్ ఖాద్రీ కుమారుడు జునైద్ ఖాద్రీ(11) సోమవారం మధ్యాహ్నం అమీన్ మండిలో ఉన్న అమ్మ మ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ఉండగా తెగి వచ్చిన ఓ పతంగిని పట్టుకోవడానికి సమీపంలోని ఓ భవనం మీదకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మూడో అంతస్తుపై నుంచి కింద పడ్డాడు. వెంటనే స్థానికులు బాలుడిని ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీ ఉస్మానియాకు వచ్చి బాలుడి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

159
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...