ఇంటింటికీ ప్రచారం.. ప్రజలతో మమేకం


Wed,November 14, 2018 12:35 AM

-అభివృద్ధిని వివరిస్తూ ఓట్లడుగుతున్న అభ్యర్థులు
-ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్
నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వాడవాడలా ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రగతిని వివరించి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించి కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని వేడుకుంటున్నారు. ప్రజలు వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.

పనిచేస్తూ.. పలుకరిస్తూ


-బేతి సుభాష్‌రెడ్డి వినూత్న ప్రచారం
ఉప్పల్, నమస్తే తెలంగాణ : ప్రజలను పలుకరిస్తూ.. చిరు వ్యాపారులు, కార్మికులు, శ్రామికులతో కలిసి పనిచేస్తూ మంగళవారం ఉప్పల్ అసెంబ్లీ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డి ప్రచారం సాగించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రామంతాపూర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో పర్యటించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఉప్పల్‌లో నివాసం ఉంటున్న సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, వ్యాసకర్త, సీనియర్ పాత్రికేయుడు టంకశాల అశోక్‌ను కలిసి టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలుపాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉండాలన్నారు. నాచారంలో హబ్సిగూడ కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి, చిలుకానగర్‌లో సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.


టీఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోలేరు


-ఎల్బీనగర్ అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్
ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ:ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి, నాయకుడు కుంట్లూరు వెంకటేశ్‌గౌడ్‌లతో కలిసి ఇంటింటికీ ప్రచారం చేశారు. రామ్మోహన్‌గౌడ్, కార్పొరేటర్ సాగర్‌రెడ్డిలకు డివిజన్ వ్యాప్తంగా బస్తీలు, కాలనీల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అనంతుల యాదగిరిరెడ్డి, కందికంటి ప్రేంనాథ్‌గౌడ్, డివిజన్ అధ్యక్షుడు రాగిరి ఉదయ్‌గౌడ్, నాయకులు వస్పరి శంకర్ కురుమ, జహీర్‌ఖాన్, జి. పాండుగౌడ్, తోట మహేశ్‌యాదవ్, కాట సాగర్ గౌడ్, ధన్‌రాజ్‌గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తా


-శేరిలింగంపల్లి అభ్యర్థి అరెకపూడి గాంధీ
హైదర్‌నగర్ : ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని శేరిలింగంపల్లి అభ్యర్థి అరెకపూడి గాంధీ ధీమా వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హైదర్‌నగర్ డివిజన్ అల్లాపూర్ సొసైటీలో కార్పొరేటర్ జానకీరామరాజుతో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్థి అరెకపూడి గాంధీ మాట్లాడుతూ అన్ని వర్గాల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, వార్డు సభ్యులు, మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఎర్రగడ్డలో గులాబీ జోరు


-మాగంటి గోపీనాథ్‌కు ప్రజల మద్దతు
ఎర్రగడ్డ, నమస్తే తెలంగాణ : ఎర్రగడ్డ డివిజన్‌లో గులాబీ శ్రేణులు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. మసీదుగల్లీ, ప్రేమ్‌నగర్, ఆనంద్‌నగర్ తదితర బస్తీల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతాల్లో ప్రచారానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న తొలి సర్కారు టీఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, కార్యదర్శి అజీం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...