టీఎన్జీవో స్పోర్ట్స్ మీట్‌లో ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొనాలి


Wed,November 14, 2018 12:16 AM

బేగంబజార్, వెంగళరావునగర్, నవంబర్ 13 : టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాల్గవ స్పోర్ట్స్ మీట్‌లో ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొనాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేన్ పేర్కొ న్నారు. మంగళవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా కార్యవర్గంతో కలిసి ఛాతి దవాఖానా యూనిట్, ఎంప్లాయిస్ ఆఫ్ చెస్ట్, సైకియాట్రి యూనిట్, డీటీసీఓ, ఎస్‌టీసీ, ఆయుష్ విభాగం తదితర శాఖలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను, అధికారులను కలిసి డిసెంబర్, జనవరిలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జింఖానా మైదానంలో క్రికెట్, ఆటల పోటీలు, 2019 జనవరి 3, 4వ తేదీలలో ఎల్‌బీ స్టేడియంలో సెమిఫైనల్, ఫైనల్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

జనవరి 7వ తేదీన శాంతినగర్ ప్రభుత్వ ఐటీఐలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పర్యటించిన శాఖలలో సంబంధిత అధికారులతో ఉద్యోగుల సమస్యల గురించి చర్చించడం జరిగిందన్నారు. టీఎన్జీవో నాయకులు ఓమర్‌ఖాన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేన్‌కు మెమొంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాఖ ప్రధాన కార్యదర్శి జి.ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్, సెంట్రల్ యూనియన్ కార్యదర్శి ఎన్.యాదగిరిరావు, కోశాధికారి ఎస్.ఉమారెడ్డి, పి.వరదరాజు, ఉపాధ్యక్షులు దేవేందర్, సంయుక్త కార్యదర్శి, స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు ఖాలిద్‌అహ్మద్‌తో పాటు నాగరాజు, అరుణజ్యోతి, లక్ష్మీనారాయణ, చారి, శ్రీధర్, వరలక్ష్మి, అలీ, రమేశ్, యాదయ్య, సీఎస్‌డీ నర్సింగ్‌రావు, ధన్‌రాజ్, ఆనంద్‌మురళీ, ఆదిల్, అనీలా, లలిత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...