మహిళల రక్షణకు.. మార్గ దర్శక్‌కు సంధానకర్తగా పోలీసులు


Wed,November 14, 2018 12:15 AM

-రాచకొండ సీపీ మహేశ్ భగవత్
-పోచారం ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో ఘనంగా మార్గ దర్శక్ వార్షికోత్సవం
ఘట్‌కేసర్ : మహిళల రక్షణ కొరకు మార్గ దర్శక్‌కు రాచకొండ పోలీసులు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ అన్నారు. ఘట్‌కేసర్ మండలం పోచారం ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రాంగణంలో మంగళవారం ఐటీ కంపెనీల్లో మహిళల భద్రత కొరకు ఏర్పాటు చేసిన మార్గ దర్శక్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీపీ మహేశ్‌భగవత్ మాట్లాడుతూ మహిళల భద్రత కొరకు పోలీసులు చేపట్టిన చర్యలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీటీమ్ పనితీరును వివరించారు. మహిళల పట్ల వేధింపులను ఎదుర్కోవడానికి మహిళలకు రక్షణ ఉన్న ప్రాథమిక చట్టాలు, కేస్ స్టడీస్, కౌన్సెలింగ్‌పై సభ్యులకు వివరించారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన మీటూ ఉద్యమం తదితర వాటిపై మహిళలు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

ఐటీ కంపెనీల్లో పనిచేసే మహిళలకు మార్గ దర్శక్ రక్షణగా భరోసాగా నిలుస్తుందన్నారు. షీటీమ్ పోలీసులు ఇప్పటి వరకు 50 బాల్యవివాహాలను అరికట్టారన్నారు. యాదాద్రిలో 37 మంది మైనర్ బాలికలను వ్యభిచార కూపం నుంచి రక్షించారని తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నాయకురాలు విష్ణుప్రియ, హెచ్‌ఆర్ డైరెక్టర్ సౌమ్య తమ అనుభవాలను సభ్యులకు వివరించారు. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేశారు. మార్గ దర్శక్ స్థాపించి ఏడాది పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. సీపీ మహేశ్‌భగవత్‌తో పాటు షీటీమ్ డీసీపీ సలీమా, మార్గ దర్శక్ ప్రతినిధులు, మనీషా, మమత, కరుణ, స్థానిక సీఐ రఘువీర్‌రెడ్డి, షీటీమ్ పోలీసులు పాల్గొన్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...