నిమ్స్‌లో రోగి మృతి


Mon,November 12, 2018 12:50 AM

ఖైరతాబాద్ : నిమ్స్‌లో అనారోగ్యంతో ఓ రోగి మృతిచెందింది. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని మృతురాలి బంధువులు దాడికి దిగారు. దీంతో నిమ్స్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యా దు చేశారు. సిద్దిపేట జిల్లా, దుబ్బాకకు చెందిన వెంకటమ్మను గతవారం నిమ్స్‌కు చికిత్స కోసం తీసుకువచ్చారు. వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా, ఆదివారం పరిస్థితి విషమించి మృతిచెందింది. అయితే అందులో పనిచేస్తున్న నర్సు వెంటిలేటర్ స్విచ్‌ను ఆఫ్ చేసి వెళ్లిందని, అదే క్రమంలో ఆమె మృతిచెందిందని బంధువులు ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆందోళనకు దిగి సిబ్బందిపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి ఇరువురిని శాంతింప చేశారు. రోగి అప్పటికే తీవ్ర అస్వస్థతో ఉందని, పరిస్థితి విషమించి ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. తాను నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని, ఆమె పరిస్థితిని చూసి వైద్యుడిని పిలిచేందుకు వెళ్లానని నర్సు చెప్పింది. వైద్య సిబ్బందిపై అకారణంగా దాడి చేయడం సరికాదని నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ అన్నారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేయడం అమానుషం అని నిమ్స్ తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.

157
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...