కదిలిన అంజన్న ఆలయం


Wed,September 19, 2018 12:41 AM

చందానగర్ (నమస్తే తెలంగాణ): చందానగర్‌లోని శ్రీ విశాఖ శారదా పీఠపాలిత వెం కటేశ్వరాలయంలోని ఆంజనేయ స్వామి దేవాలయం ఎత్తు పెంపు, రెండు అడుగులు వెనకకు తరలించే పనులు మొదలయ్యాయి. ఇటు వెంకటేశ్వర, అటు శివాలయలకు మద్యలో రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన అంజన్న ఆలయం ఎత్తులో 4 అడు గులు కిందకు, పొడువులో రెండు అడుగులు ముందుకు ఉంది. దీంతో వాస్తు ప్రకారం ఆలయాన్ని తొలగించి పునర్నిర్మించాలని చాలా కాలంగా ఆలయ కమిటీ భావిస్తుంది. ఐతే ప్రస్తుతం ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని తొలగించి పునర్నిర్మించాలంటే దాదాపూ రూ.60 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి తోడు నిర్మాణానికి సంవత్సర కాలం పడుతుంది. అదేవిధంగా ఆలయాన్ని తొలగించి మళ్లీ కట్టాలంటే ఆగమ శాస్త్రం ప్రకారం అనేక పూజా కృతులు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలయ ప్రధా నార్చకులు సాయిపంతులు మధ్యే మార్గంగా ఆలయాన్ని కూల్చివేయకుండా ఎత్తు పెంచడం, వెనకకు తరలించడంలోని ప్రత్యేక పద్ధతిని ఆలయకమిటీ ముందుంచారు.

ఆ దిశగా కమిటీ నిర్ణయం తీసుకుంది.నగరానికి చెందిన జేజే బిల్డింగ్ అప్ లిఫ్టింగ్, షిఫ్టింగ్ సంస్థ ఆంజనేయ స్వామి ఆలయ ఎత్తు పెంపు, వెనకాలకు తరలించే పనులను స్వీకరించింది. గత రెండు వారాలుగా ఆలయం బేస్‌మెట్ కింద నుంచి తవ్వి ఫ్లింత్ బీమ్‌ల కింద ఇటుకలతో బేస్ నిర్మాణం చేశారు. దానిపై భారీ బరువులను ఎత్తే జాక్‌లను ఏర్పాటు చేశారు. ఆలయం ముఖ మండపంతో గర్భగుడిని వేరుచేసి మూ వింగ్ జాక్‌లతో వెనక్కు నెట్టే ప్రయత్నం చేశారు. మంగళవారం ఆలయాన్ని రెండు అడుగులు వెనక్కు నెట్టగా, బుధవారం నుంచి నాలుగు అడుగులు పైకి లేపనున్నారు. గర్భగుడిలో దేవుడిని కదిలించకుండా రెండడుగులు వెనక్కి తరలించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ రూ.10 లక్షలలోపు కావడం విశేషం.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...