లాల్‌దర్వాజ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా


Sun,September 16, 2018 12:29 AM

చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం మధ్యాహ్నం పాతపట్టణం లాల్‌దర్వాజలోని సింహవాహిని శ్రీమహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా రాక సందర్భంగా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువిరిసింది. అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ శ్రేణులు ఆయ నకు సాధారణంగా స్వాగతం పలికారు. అమిత్ షా రాక సందర్భంగా దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందో బస్తును ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అమిత్ షాకు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. అమ్మవారి దర్శనం అనంతరం మహబూబ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, ఆలే జితేంద్ర, చర్మని రూప్‌రాజ్, పాశం సురేందర్, తాడెం శ్రీనివాస్‌రావు, కౌడీ మహేందర్, ఎం.కుమార్, ఆలయ కమిటీ సభ్యులు మహేశ్‌గౌడ్, మాణిక్ ప్రభుగౌడ్, విష్ణుగౌడ్, కాశీనాథ్ గౌడ్, శీర రాజ్ కుమార్, బల్వంత్ యాదవ్, రాజ్ కుమార్ యాదవ్, అరవింద్ గౌడ్ పాల్గొన్నారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...