రేషన్ డీలర్లకు 50శాతం పెరిగిన కమీషన్


Sun,September 16, 2018 12:28 AM

- పెరిగిన కమీషన్ చెక్కులు రేషన్ డీలర్లకు పంపిణీ
- జిల్లాలో 488 మంది డీలర్లకు లబ్ధి
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : రేషన్ డీలర్లకు 50శాతం కమీషన్ పెం చుతూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో కేవలం 20శాతం మాత్రమే ఉన్న కమీషన్‌కు అదనంగా మరో 50శాతం పెంచింది. అంటే ఇక నుంచి ప్రతి రేషన్ డీలర్‌కు క్వింటాల్ బియ్యంకు రూ.70 కమిషన్ అందనుంది. గత ప్రభుత్వాల హయాంలో రేషన్ డీలర్లకు చాలి చాలని కమిషన్ వచ్చేది. దీంతో కొందరు రేషన్ డీలర్లు రేషన్ సరకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించేవారు. అయితే పేదలకు అందాల్సిన సరకులు బ్లాక్

మార్కెట్‌కు తరలించడంను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో ఈ-పాస్, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, ఐరిష్, బ యోమెట్రిక్, ఫోర్టబులిటీ, టీ-రేషన్ ఆప్ ఇలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం రేషన్ డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చే కమిషన్ గిట్టుబాటు కావ డం లేదని గుర్తించిన ప్రభుత్వం 20శాతం కమీషన్‌ను 70 శాతంకు పెంచారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డీలర్లకు 2016 డిసెంబర్ నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ వరకు ప్ర భుత్వం పెంచిన అదనపు కమీషన్‌కు సంబంధించిన చెక్కులను జిల్లా సివిల్ సైప్లె అధికారులకు అందించారు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లాలో మొత్తం 636 రేషన్ డీలర్లు ఉన్నప్పటికీ 488 డీలర్లకు రూ.3.75 కోట్లు (రూ.3,75,68,158)ను డీలర్లకు పంపిణీ చేశారు. మిగిలిన 148మంది డీలర్లపై శాఖాపరమైన విచారణ కొనసాగుతున్నందున వారికి చెక్కులను పంపిణీ చేయడం లేదని జిల్లా సివిల్ సైప్లె అధికారిణి సి.పపద్మ తెలిపారు. చాలా రోజుల తరువాత సుమారు రెండున్నరేండ్ల కమీషన్ ఏకకాలంలో రావడంతో డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

162
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...