నేత్రానందం


Sat,September 15, 2018 01:29 AM

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : గ్రేటర్ వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 14వ తేదీ వరకు గ్రేటర్ పరిధిలో4,92,347 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. ఇందులో 1,16,861 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా, 55,493మందికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రెఫర్ చేసినట్లు ఆయన చెప్పారు. ఒక్క శుక్రవారమే 34,060 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో 5986 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా, 1872 మందికి శస్త్రచికిత్సలు జరిపేందుకు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. జోన్లవారీగా చూస్తే, చార్మినార్ జోన్‌లో 8042, ఎల్బీనగర్‌లో 5316, ఖైరతాబాద్‌లో 5763, శేరిలింగంపల్లిలో 2777, సికింద్రాబాద్ 6322, కూకట్‌పల్లి జోన్‌లో 5840 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు కమిషనర్ వివరించారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...