శోభాయాత్ర మార్గాల్లో పనులు ముమ్మరం


Thu,September 13, 2018 12:13 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వినాయక నిమజ్జనం సజా వుగా సాగేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ. 10కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ పనులు తుదిదశకు చేరుకున్నా యి. వచ్చే వారం రోజుల్లో పనులన్నీ పూర్తిచేసే విధంగా కార్యప్రణాళిక సిద్ధంచేసిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్ల మరమ్మతులు నిమజ్జనం చివరి రోజు మహాశోభాయాత్రకల్లా పూర్తిచేయాలని, మిగిలిన పను లు అంతకు రెండు-మూడు రోజుల ముందే పూర్తి చేయా లని నిశ్చయించారు.గురువారం వినాయకచవితి పం డుగ జరగనుండగా మూడవ రోజునుంచే నిమజ్జనఘట్టం ప్రా రంభమవుతుంది. 11వరోజు ప్రధాన శోభాయాత్ర జరు గుతుంది అత్యంత కోలాహలంగా జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో హుస్సేన్‌సాగర్‌సహా వివిధ చెరువుల్లో భారీ సైజులో గణనాథుడి విగ్రహాలను నిమజ్జనంచేస్తారు. ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్‌సాగర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కన్నులపండుగగా సాగే ఈ కార్య క్రమాన్ని తిలకించేందుకు లక్షలాదిగా జనం తరలివస్తారు. దీంతో విగ్రహాల నిమజ్జనం సజావుగా సాగేందుకు, అంతే కాకుండా భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేయా ల్సివుంది. ఈ క్రమంలోనే బల్దియా ఈ ఏడాది రూ. 10 కోట్లు మంజూరుచేసింది. ఇందులో భాగంగా ప్రధాన ఊరే గింపు మా ర్గా ల్లో రోడ్లపై గుంతల పూడ్చివేత, చెరువుల వద్ద ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణం, క్రేన్ల ఏర్పాటు, లేబర్‌ను నియమించడం, వైద్య కేంద్రాలు, మొబైల్ టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేపట్టారు. 81టాయిలెట్లు, 81క్రేన్లు ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవికాకుండా మరో 107మొబైల్ క్రేన్లను కూడా ఏర్పాటుచేస్తున్నా మన్నారు. వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో 30 లక్షల వాటర్‌బోర్డులు ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పనులు వచ్చే వారం రోజు ల్లో పూర్తవుతాయని జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు.

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...