29,645 మందికి కంటి పరీక్షలు


Thu,September 13, 2018 12:10 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో బుధవారం 29,645 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. ఇందులో 6,000 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా, 1,856 మందికి శస్త్ర చికిత్సలు జరిపేందుకు రెఫర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జోన్లవారీగా చూస్తే.. చార్మినార్‌జోన్‌లో 6,531, ఎల్బీనగర్‌లో 5,417, ఖైరతాబాద్‌లో 4,180, శేరిలింగంపల్లిలో 2,864, సికింద్రాబాద్ 4,972, కూకట్‌పల్లి జోన్‌లో 5,681 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు కమిషనర్ వివరించారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...