1.40 లక్షల మట్టి గణపతులు


Tue,September 11, 2018 12:19 AM

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : పర్యావరణ హితం కోసం జీహెచ్‌ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లు 1.40 లక్షల మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నాయి. చార్మినార్, కూకట్‌పల్లి జోన్లలో 16,000 చొప్పున, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్లలో 17000 చొప్పున మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ద్వారా 26, పీసీబీ ద్వారా 12 స్టాళ్లను ఏర్పాటు చేసి విగ్రహాలను అందజేయనున్నారు. గ్రేటర్‌లో మొత్తం 1.40 లక్షల మట్టి విగ్రహాలను బుధవారం ఒక్కరోజు మాత్రమే అందజేస్తామని పీసీబీ సభ్య కార్యదర్శి సత్యనారాయణరెడ్డి తెలిపారు. పంపిణీ చేసే కేంద్రాల వివరాలివి..

పీసీబీ ఆధ్వర్యంలో.. గణేశ్ దేవాలయం వైఎంసీఏ , కోఠి మహిళా కాలేజీ, సత్యం థియేటర్,అమీర్‌పేట , రైతుబజార్, మెహిదీపట్నం, రైతుబజార్, షాపూర్ , సుచిత్ర, కుత్బుల్లాపూర్, బాలానగర్, కూకట్‌పల్లి, ఉప్పల్ సర్కిల్, నాగోలు, ఎల్బీనగర్, సనత్‌నగర్ పీసీబీ ప్రధాన కార్యాలయం వద్ద.

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో..
బల్కంపేట వార్డు కార్యాలయం, ఖైరతాబాద్ వార్డు కార్యాలయం, కుందన్‌బాగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కాలనీ, కార్పొరేషన్ ఆఫీస్ కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, మలక్‌పేట, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మూసాపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, బేగంపేట, సికింద్రాబాద్, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, పీజేఆర్ స్టేడియం చందానగర్, యూసుఫ్‌గూడ.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...