డాలర్ దొంగ నయాైస్టెల్..


Mon,September 10, 2018 12:35 AM

-మానసిక ఉల్లాసం కోసం 100 కిలో మీటర్ల ప్రయాణం..
-చేసిన మోసాన్ని ఆస్వాదించడానికి...ఓ మోసగాడి ఘాతుకం
-హైదరాబాద్ ప్రజలు చాలా అమాయకులు..
-బొల్తా కొట్టించడం ఈజీ..
-విచారణలో వ్యాఖ్యలు చేసిన అమెరికా డాలర్ దొంగ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వంద కిలోమీటర్ల ప్రయాణం...ఆ తర్వాత చేసిన మోసం గురించి ఆలోచిస్తూ..ఎంత సులువుగా ఎదుటి వాడిని ఛీటింగ్ చేశానని నవ్వుకుని సంతృప్తి చెందుతూ మానసిక సంతోషం పొందుతున్న ఓ నేరగాడి ైస్టెల్ ఆసక్తికి గురి చేస్తుంది. గత నెల అగస్టు 10న సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసిన అమెరికా డాలర్ దొంగ సిద్ధిఖీ అలియాస్ సులేమాన్ మహ్మద్ ఖాన్‌లో ఈ విచిత్ర కోణం బయటపడింది. గోవాకు చెందిన ఈ సిద్ధిఖీ సెంట్రింగ్ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎదిగాడు. అయినా డబ్బు పెరిగిన కొద్ది ఆలోచనలు దారి తప్పడంతో చివరకు అమెరికా డాలర్‌లను మారుస్తానంటూ అందర్నీ మోసం చేస్తూ లక్షలాది రుపాయలను కొల్లగొడుతూ చాలా మంది ఏజెంట్‌లను పరేషాన్ చేసిన సంగతి తెలిసిందే. గోవా,కర్నాటక, మహరాష్ట్ర, పుణే, నాగ్‌పూర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్, సంగారెడ్డిలోని కంది ప్రాంతంలో ఆస్తులను కొనుగోలు చేసి నగరంలోని స్టార్ హోటల్స్‌కి తన మకామ్‌ను మార్చుకున్నాడు.

మెడలో స్టేథస్‌స్కోప్ వేసుకుని డాక్టర్‌గా చలామణీ అవుతూ అమెరికా డాలర్లు ఇస్తే మార్కెట్ ధర దేశీయ కరెన్సీ ఇస్తానని ఇతరులను పరిచయం చేసుకుని బురిడీ కొట్టిస్తుంటాడు. ఇలా సిద్ధిఖీ అలియాస్ సులేమాన్ మహ్మద్ ఖాన్ హైదరాబాద్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బుచ్చయ్య, షేక్ జావీద్, రఫీక్ తదితరుల నుంచి వేలాది రుపాయల డాలర్లను తీసుకుని వారికి రంగు పేపర్లను ఇచ్చి మోసం చేశాడు. జూలై 26న నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనలో బాధితుడు సిద్ధిఖీ తన నుంచి 30వేల అమెరికా డాలర్లు కాజేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు 15 రోజుల పాటు గాలించి అతడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణలో అతను హైదరాబాద్‌లో మనుషులను అత్యంత సులభంగా మోసం చేయొచ్చని చెప్పడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది.

100 కిలో మీటర్లు ప్రయాణం...మానసిక ఉల్లాసం..
సిద్ధిఖీ అమెరికా డాలర్లు మోసం చేసేందుకు ముందస్తుగా ఓ పథకం రచించుకుంటాడు. దీని కోసం రూ.2 వేల నోటు రంగు, సైజును పోలి ఉండే పేపర్లను కట్ చేసి పెట్టుకుంటాడు. పైన నాలుగు నుంచి ఐదు అసలు నోట్లను పెట్టి కింద అన్ని రంగు పేపర్లు పెట్టి పైకి అసలు నోట్లను కనిపించే విధంగా ప్యాకింగ్ చేస్తాడు. చేతికి బండిల్ ఇవ్వగానే అందులో ఉన్నవని అసలు నోట్లని నమ్మించే విధంగా ప్యాకింగ్ చేసి అవి త్వరగా ఇప్పుకోకుండా నాలుగు నుంచి ఐదు కవర్లను చుట్టేస్తాడు. ఆ తర్వాత ఎక్స్చేంజ్ కోసం ఎదుటి పార్టీని కచ్చితంగా ఓఆర్‌ఆర్ సమీపంలోకి తీసుకెళ్తాడు.

అక్కడ ఇండియన్ కరెన్సీ బండిల్‌ను వారికి ఇచ్చి డాలర్లను తీసుకుంటాడు. రంగు పేపర్ కరెన్సీని పార్టీ గుర్తించకుండా ఉండేందుకు కారు ట్రబుల్ ఇస్తుందని వెనకనుంచి తోయాలని వారి దృష్టి మళ్లించి కారు తోసే క్రమంలో ఉండగానే దానిని స్టార్ట్ చేసుకుని వేగంగా అక్కడి నుంచి పరారై దాదాపు 100 కిలో మీటర్లు ప్రయాణించి ఓ చోట ఆగిపోతాడు. తన మోస ప్రక్రియ విధానాన్ని పదేపదే తలచుకుని ఒక్కడే నవ్వుకుని మానసిక ఉల్లాసాన్ని పొందుతాడు. అలా అరగంట గడిపిన తర్వాత కారును అక్కడే వదిలేసి తిరిగి బస్సు లేదా అద్దెకారులో హైదరాబాద్‌కు చేరుకుని బస చేసి మరో చీటింగ్‌కు స్కెచ్ వేస్తాడని విచారణలో వెలుగు చూసింది. అంతేకాకుండా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ప్రజలు చాలా అమాయకులని, మోసం చేయడం చాలా ఈజీ అని వ్యాఖ్యానించడం విస్మయాన్ని కలిగిస్తుంది.

కారు కింద తనిఖీ చేస్తారు..డిక్కీ తెరుస్తారు...
సిద్ధిఖీ తన వెంట ఎప్పుడు తుపాకీని పెట్టుకుని తిరిగినా ఇప్పటి వరకు ఎవరీకి కూడా దొరుకలేదు. స్టార్ హోటల్స్‌లో బస చేసిన సెక్యురిటీ అతడిని గుర్తించలేదు. ఎందుకంటే అతడు ఎప్పుడు తుపాకీని కారులో సీటు కింద పెట్టేస్తాడు. కారులో వెళ్లినప్పుడు కూడా స్టార్ హోటల్స్ సెక్యురిటీ కేవలం కారు కింది భాగంలో అద్దంతో మొదట తనిఖీ చేసి, ఆ తర్వాత కారు డిక్కీ తీసి తుతూమంత్రంగా చెక్ చేసి పంపిస్తారని అతడే స్వయంగా విచారణలో చెప్పాడు. సైబరాబాద్ స్పెషల్ అపరేషన్ టీం అరెస్టు చేసిన సిద్ధిఖీ ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నాడు. ఇతడిపై పీడీయాక్ట్ నమోదయ్యే అవకాశం ఉంది.

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...