-ఐదు వేల కోట్ల అభివృద్ధి పనులు
-38 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు
-పెద్ద ఎత్తున స్కైవేలు, ైఫ్లెఓవర్ల నిర్మాణం
-త్వరలోనే 202 గ్రామాలకు ఇంటింటికి తాగునీరు
కంటోన్మెంట్: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. నేడు ఐదువేల కోట్ల అభివృద్ధి పనులకు కేంద్ర బిందువైంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గం దశమారింది. సీఎం కేసీఆర్ ప్రోత్సహం.. మంత్రి కేటీఆర్ చొరవ..ఎంపీ మల్లారెడ్డిల పట్టుదలతో నాలుగేండ్ల కాలంలోనే ఎంతో ప్రగతి సాధించింది.
38వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..
రెండు పడకల ఇండ్ల పథకంలో భాగంగా 38 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నారు.
ఇంటింటికి తాగు నీరే లక్ష్యం..
అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.1400 కోట్లు వెచ్చించి, 56 రిజర్వాయర్లు 284 కిలో మీటర్ల ట్రంక్‌లైన్, 2624 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల 202 గ్రామాలకు రూ.628 కోట్లతో 2018,డిసెంబర్‌లోపు ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు.
సిగ్నల్ ఫ్రీ ప్రాంతం..
ట్రాఫిక్ రహితంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున స్కైవేలు, ైప్లె ఓవర్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఎస్ఆర్డీపీ పథకం కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.331.38 కోట్లతో ఎల్బీనగర్ జంక్షన్, బైరామల్‌గూడ జంక్షన్, కామినేని హాస్పిటల్ జంక్షన్, చింతల్‌కుంట చెక్‌పోస్ట్ జంక్షన్ వద్ద మల్టీలెవల్ స్కైవేలను నిర్మించి,ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.