జ్ఞాన చైతన్య యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ


Fri,December 13, 2019 01:21 AM

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ: మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్రకు సంబంధించిన పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుతం కరీంనగర్‌లో కొనసాగుతోందన్నారు. జిల్లాకు సోమవారం చేరుకుంటుందని, క్షత్రియ ఫంక్షన్‌ హాల్‌లో 10ః30 గంటలకు విద్యార్థులతో జ్ఞాన మహాసభతో ప్రారంభమవుతుందని తదనంతరం రోడ్‌షోను కమ్మర్‌పల్లి, భీమ్‌గల్‌, జక్రాన్‌పల్లిలో రాత్రి బస చేస్తారని, నిజామాబాద్‌లో సభ కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ అశోక్‌, డాక్టర్‌ ప్రకాశ్‌, ఆర్మూర్‌ ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ సంతోష్‌, సమతసైనిక్‌ దళ్‌ రెంజర్ల రాజేశ్‌, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌ నాయకులు సాయి, వినోద్‌, రాజేశ్వర్‌, రమేశ్‌, రాజేందర్‌, నర్సయ్య, హరీశ్‌, టీటీసీ, టీజీపీఏ నాయకులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...