వింటర్‌ ఉత్సవ్‌ ఎగ్జిబిషన్‌ షురూ


Thu,December 12, 2019 01:58 AM

ఖలీల్‌వాడి : నగరంలోని ఉమెన్స్‌ కళాశాల గ్రౌండ్‌లో వింటర్‌ ఉత్సవ్‌ మేళా ఎగ్జిబిషన్‌ను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా బుధవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన నిర్వాహకులు మొట్టమొదటి సారిగా నగరంలో ఎగ్జిబిషన్‌ ప్రారంభించడం అభినందనీయమన్నా రు. 12 రకాల ఆట వస్తువులను ప్రదర్శించనున్నారని, జేయింట్‌ వీల్‌, అక్టోపస్‌, బ్రేక్‌డ్యాన్స్‌ వీల్‌, విశాఖపట్నంలో అత్యధికంగా ప్రసిద్ధి గాంచిన పిల్లల కోసం జేయింట్‌ వీల్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఫొటోషూట్‌ ఇందూరులో ఆకర్షణీయంగా నిలుస్తుందన్నారు. అబ్దుల్‌ కలాం, మథర్‌ థెరిస్సా, కోతిబొమ్మ, కత్తిసాము లాంటి త్రీడీ ఫ్లెక్సీలను ఫొటోషూట్‌గా ఏర్పాటు చేయడం బాగుందని తెలిపారు.

కేవలం జూప్కారులు,అడవుల్లో మాత్రమే కనిపించే అనేక రకాల జంతువులను స్వయంగా రోబోటిక్‌ జంతువులు వింత మనుషులతో ఫొటోలు దిగినట్లుగా ఉండే మ్యూజి యం, పిల్లలను ఎంతో ఆకర్షిస్తాయని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో అరవై షాపులతో వివిధ రకాల వస్తువుల స్టాళ్లను ఏర్పాటు చేశారని తెలిపారు. ఎన్నో రకాల డ్రైస్‌ మెటీరియల్స్‌, చీరలు, గృహోపకరణాలు, మహిళల అలంకరణ వస్తువులతో పాటు వందలాది ఉత్పత్తులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జిబిషన్‌ నిర్వాహకుడు రఫీక్‌ను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్వి తారీఖ్‌ అన్సారీ, మాజీ కార్పొరేటర్లు ఎనగందుల మురళి, చాంగుబాయి, దారం సాయిలు, కైసర్‌, అబ్దుల్‌ ఖుద్దూస్‌, నాయకులు రంగు సీతారాం పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...