స్త్రీశక్తి భవనాలపై సమీక్ష


Wed,December 11, 2019 06:15 AM

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని స్త్రీశక్తి భవనాల నిర్మాణాలపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేకంగా ఆరాతీశారు. మొత్తం ఏడు మండలాలకు జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి , ధర్పల్లి మండలాల్లో పూర్తికాగా.. సిరికొండలో పనులు తుది దశకు చేరాయి. మోపాల్, ఇందల్వాయి మండలాల్లో నిర్మించాల్సి ఉంది. వీటిని వెంటనే నిర్మించేలా చర్యలు తీసుకోవాలని, నిర్మించిన వాటిల్లో టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో నిర్మించే మహిళా సంఘాల భవనాలపై ఎమ్మెల్యే సమీక్షించారు. ఇప్పటి వరకు ఎన్ని పూర్తయ్యాయి? ఇంకా పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయి? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామల్లో మహిళా సంఘ భవనాలన్నీ పూర్తి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కుటుంబంలో మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కటుంబం ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని, దీని కోసమే ప్రత్యేకంగా సంఘాల ఆర్థిక బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని తెలిపారు. మహిళలు డబ్బులు దుబారా చేయకుండా పొదుపు చేస్తారని, తమ పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివించాలని, ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు మొత్తం ప్రభుత్వమే ఖర్చు భరించి కార్పొరేట్ తరహా విద్య, సౌకర్యాలను అందిస్తున్నదని తెలిపారు.ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు వేలకు వేల రూపాయలు ఫీజుల రూపంలో చెల్లించి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని సూచించారు. మహిళలు ఎప్పకప్పుడు మార్కెటింగ్ వ్యవస్థను గమనించాలని, స్వయం ఉపాధి పొందే విషయంలో కొత్త ఆలోచనలు చేయాలని, దానికి తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. 17న మళ్లీ సమావేశంనిర్వహించుకొని కుటీర పరిశ్రమల ఏర్పాటులో ఆలోచనలను పంచుకోవాలని సూచించారు. ఈనెల 28లోగా వ్యాపార రంగంలో రాణించేందుకు,కుటీర పరిశ్రమల ఏర్పాటులో మెళకువల కోసం నిపుణలతో సమావేశం, శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య మండలి అధ్యక్షురాలు కరుణ, మోపాల్, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాల అధ్యక్షురాళ్లు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...