ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి


Fri,December 6, 2019 12:52 AM

ఇందూరు: 2013 నుంచి ప్రారంభమైన ఆదర్శ పాఠశాలలు ఇప్పటి వరకు ఎలాంటి ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని పీఎంటీఏ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేట్‌ స్థాయిలో ఆదర్శ పాఠశాలలు నడుస్తున్నప్పటికీ, వందల మార్లు వినతిపత్రాలు అధికారులకు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఆరేండ్లు పూర్తయినప్పటికీ ఒక్కసారి కూడా బదిలీలు జరగలేదని, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...