రెండు గంటలు.. నరకయాతన


Fri,December 6, 2019 12:51 AM

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ నగరంలోని చంద్రానగర్‌ సమీపంలో గల శ్మశానవాటిక ముందు మెయిన్‌ రోడ్డు వెంట డ్రైనేజీని తీయబోయి గురువారం ఇద్దరు మున్సిపల్‌ కార్మికులు అందులో పడిపోయారు. అందులో ఒకరు బయటకు రాగా.. మరొకరు డ్రైనేజీలోనే ఇరుక్కుపోయి రెండు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. దీంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో ఇరుపక్కల తవ్వి, ఇద్దరు వ్యక్తుల సహాయంతో కార్మికుడిని జాగ్రత్తగా బయటకు తీయించారు. కార్మికుడు క్షేమంగా బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 108, 102 సేవలకు ఫోన్‌ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గతంలో ఎల్లమ్మగుట్ట ప్రాంతంలోని డ్రైనేజీలో పడి ఒక కార్మికుడు మరణించిన విషయం విధితమే. 2014లో కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న మంగతాయారు హయాంలో డ్రైనేజీలో ఉన్న పైపులైన్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అప్పటి ఎంహెచ్‌వో నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి డ్రైనేజీలను తొలగించాలని వారు కోరారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...