విద్యార్థులకు రవాణాభత్యం చెక్కుల పంపిణీ


Fri,December 6, 2019 12:51 AM

వర్ని : పాతవర్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హుమ్నాపూర్‌ గ్రామం నుంచి వచ్చి చదువుకుంటున్న ఏడుగురు విద్యార్థులకు రూ.6000 చొప్పున ప్రభుత్వం అందిస్తున్న చెక్కులను ఎంపీపీ మేక శ్రీలక్ష్మి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం చేయని విధంగా విద్యార్థులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వసతులను కల్పిస్తున్నదని అన్నారు. విద్యార్థులకు రవాణా చార్జీలు ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారని తెలిపారు. బాగా చదువుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఎంపీపీ విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎంబడి పద్మ, ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్‌, నాయకులు మేక వీర్రాజు, నాగభూషణం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...