ఖాకీ భరోసా


Wed,December 4, 2019 01:49 AM

-శంషాబాద్ ఘటనతో అప్రమత్తమైన పోలీసుశాఖ
-పోలీసుశాఖపై మహిళలకు నమ్మకం పెంచేలా చర్యలు
-ఆ దిశగా కార్యాచరణ
-పకడ్బందీ నిఘా.. శివారు ప్రాంతాలపై నజర్
-జీరో ఎఫ్‌ఐఆర్ విషయంలో కచ్చితమైన ఆదేశాలు


నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసుశాఖ అప్రమత్తమైంది. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతుండడం, జరుగుతున్న ఘటనలపై సభ్యసమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న క్రమంలో ఖాకీల్లో అంతర్మథనం మొదలైంది. ఆపద సమయంలో పోలీసులే రక్షిస్తారనే విధంగా మహిళల్లో బలమైన విశ్వాసాన్ని కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీరియస్‌గా కసరత్తు మొదలైంది. గతంలో జరిగిన పొరపాట్లను పునరావలోకనం చేసుకుంటూనే.. ఇప్పుడు చేపట్టాల్సిన చర్యలపై పోలీస్‌శాఖలో చర్చ మొదలైంది.

దీనిపై పోలీస్ శాఖలో సీరియస్‌గా కసరత్తు జరుగుతున్నది. తాజాగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పోలీసుశాఖ అప్రమత్తమైంది. పోలీస్ కమిషనర్ కార్తికేయశర్మ నేతృత్వంలో ముఖ్యమైన విభాగాల పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా మహిళలపై అఘాయిత్యాలు, తీసుకోవాల్సిన చర్యలు, పకడ్బందీ నిఘా, నేరాల నియంవూతణకు ముందస్తు జాగ్రత్తలు, మహిళలు పోలీసులపై నమ్మకాన్ని పెంచుకునే విధంగా చేపట్టాల్సిన చర్యలపై సుధీర్ఘ చర్చ జరిగింది. పలు కీలక అంశాలపై సీపీ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. షీటీమ్స్ ఇప్పటి వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్, వాటి ఫలితాలు పరిగణలోకి తీసుకొని, ఇంకా జన బాహుల్యంలోకి తీసుకు నిర్ణయం తీసుకున్నారు.

షీటీమ్‌నే మరింత బలోపేతం చేసే అవసరం ఉందని గుర్తించారు. షీటీమ్స్ చేపడుతున్న కార్యక్షికమాలు, మహిళలకు ఆపద సమయంలో అండగా ఉంటున్న వైనంపై కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కార్యక్షికమాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించడం, బాధితులైన మహిళలకు అండగా నిలబడేందుకు పోలీసుశాఖను మరింత అప్రమత్తం చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మహిళ పోలీస్‌స్టేషన్ ద్వారా బాధితులకు అంతంత మాత్రంగానే న్యాయం జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. పంచాయితీలకు ఒక దశలో ఈ స్టేషన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే అపవాదు ఉంది.

దీన్ని పోగొ మహిళా పోలీస్‌స్టేషన్‌కు పూర్తి స్థాయి ఎస్సైను కేటాయించడంతో పాటు సరిపడా సిబ్బంది, మహిళ కానిస్టేబుళ్ల నియామకం చేపట్టాలని సమాలోచనలు చేస్తున్నారు. ‘డయల్ 100’కు ఫిర్యాదు అందిన వెంటనే సత్వరం చర్యలు తీసుకునే విధంగా, ‘డయల్ యువర్ సీపీ’ కార్యక్షికమంపై ప్రజల్లో అవగాహన పెంచి.. నేరుగా మారుమూల ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు వెలుగు చూడని దుశ్చర్యలు పోలీసుశాఖ దృష్టికి తీసుకువచ్చే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయం ఖాకీలు గుర్తించారు. జిల్లా పోలీస్‌శాఖపై మాయనిమచ్చగా ఎలాంటి సంఘటనలు నిలిచిపోరాదని, అలా చేయాలంటే ముందస్తు పకడ్బందీ చర్యలు తీసుకోవడమే పరిష్కారమని భావిస్తున్నారు.

ఆ దిశగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే ప్రధానంగా మహిళలకు పోలీసుశాఖకు విశ్వాసం పెరుగుతుందనే అంశంపై లోతుగా చర్చ జరుగుతోంది. మరోవైపు స్టేషన్ తమ పరిధి కాదంటూ తప్పించుకునే ధోరణి ఇకపై ఎవరూ అవలంభించరాదనే కచ్చితమైన ఆదేశాలు అన్ని పోలీస్‌స్టేషన్లకు వెళ్లాయి. తెలిసో తెలియకో ఖాకీలు చేసే పొరపాటు, అలసత్వం బాధితులకు గుదిబండలా మారరాదని, ఇదే శాఖకు మాయనిమచ్చగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసుశాఖ ఉన్నతాధికారులు.. ప్రతి విషయంలోనే ఖాకీలు అప్రమత్తతో వ్యవహరించాల్సిన అనివార్యతపై అంతర్మథనం మొదలుపెట్టారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...