నేటి నుంచి సైన్స్ ఫేర్


Wed,December 4, 2019 01:32 AM

-300 ప్రదర్శనలకు రిజిస్ట్రేషన్లు
-ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ
-రెండ్రోజుల పాటు ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్‌లో ప్రదర్శనలు
-ప్రారంభిచనున్న స్పీకర్ పోచారం
-పాల్గొననున్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు


నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: విద్యార్థులో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికితీసే క్రమంలో వారి ప్రతిభను ప్రదర్శన రూపంలో చూపేందుకు ఏటా నిర్వహించే సైన్స్ ఫేర్ కార్యక్షికమం బుధవారం (నేడు) ప్రారంభంకానున్నది. నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్‌లో రెండ్రోజుల పాటు నిర్వహించే సైన్స్ ఫేర్ కార్యక్షికమాలు ప్రారంభంకానున్నాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్షికమాన్ని ప్రారంభించేందుకు డీఈవో జనార్దన్‌రావు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌డ్డిని ఆహ్వానించారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం ఈ కార్యక్షికమానికి రావాల్సిందిగా డీఈవో కోరారు. మొత్తం 600 మంది విద్యార్థులు 300 ప్రదర్శనలు ఇవ్వనున్నారు.


ప్రతి ప్రదర్శనకు ఇద్దరు చొప్పున విద్యార్థులుంటారు. ఒక్కో ప్రదర్శనకు ఒక్కో టీచర్ పర్యవేక్షణ చేస్తారు. దాదాపు 250 ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన 300 ప్రదర్శనలు ఇచ్చేందుకు మంగళవారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగా సైన్స్ ఫేర్‌ను విజయవంతం చేసేందుకు అన్ని స్కూళ్ల విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ఇప్పటికే ప్రతి స్కూల్‌లోని స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఫిజిక్స్, బయోలజీ, మ్యాథ్స్ సబ్జెక్టుల టీచర్లకు డీఈవో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సైన్స్ ఫేర్ కార్యక్షికమంలో ఇచ్చిన ప్రదర్శనల విభాగంలో ఆరు చొప్పున సబ్ టీమ్‌లను ఏర్పాటు చేస్తారు.

సీనియర్ ఆరు టీమ్‌లు, జూనియర్ ఆరు టీమ్‌లుగా విభజిస్తారు. వీటిలో ఎంపికైన వాటిని రాష్ట్రానికి ఆ తర్వాత సౌత్ ఇండియా లెవల్ (బెంగళూరు) ప్రదర్శనకు పంపుతారు. అక్కడ ఎంపికైన వాటిని నేషనల్‌కు పంపుతారు. ఈ సైన్స్ ఫేర్‌లో టీచర్లకు కూడా ప్రదర్శనలు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తారు.

ఇప్పటి వరకు 12 మంది టీచర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి ఏడాది జరిగే కార్యక్షికమాల్లో భాగంగా గతేడాది ఇన్స్‌ఫైర్ కార్యక్షికమంలో విజయ్ హై స్కూల్‌కు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శన జాతీయ స్థాయిలో ప్రదర్శనకు ఎంపికైంది. గతేడాది నిర్వహించిన సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా నిర్మల హృదయ స్కూల్ విద్యార్థుల ప్రదర్శన జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. సైన్స్ ఫేర్ కార్యక్షికమం నుంచి గతేడాది బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండలానికి చెందిన ప్రదర్శన జాతీయ స్థాయికి ఎంపిక కావడం విశేషం.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...