రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక


Wed,December 4, 2019 01:31 AM

కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ/మెండోరా/భీమ్‌గల్/సిరికొండ /ఆర్మూర్, నమస్తే తెలంగాణ : కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్యా సాయి హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థులు నానం నాగశేషు, స్థంబంపల్లి సతీశ్ ఎస్‌జీఎఫ్. బీచ్ వాలీ బాల్ అండర్-14 బాలుర విభాగం రాష్ట్రస్థాయి పోటీలకు ఎం పికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగాడ్డి తెలిపారు.

ఈ నెల 2న జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో వీరు జిల్లా ప్రథమ బహుమతి సాధించారు. దీంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 5, 6 తేదీల్లో మహబూబ్ నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు. వీరిని మంగళవారం పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగాడ్డి, పీఈటీ బాల్ కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, పవన్, రమాదేవి, భార్గవ్ సన్మానించి అభినందించారు.

పోచంపాడ్ జడ్పీహెచ్‌ఎస్ నుంచి..
మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫణీంద్ర, రవి అండర్-17 రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ భూపతి తెలిపారు. ఉమ్మడి జిల్లాల బీచ్ వాలీబాల్ ఎస్‌జీఎఫ్ టోర్నమెంట్‌లో మొదటి స్థానం లభించి వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎం పిక చేశారన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మనోహర్, ఉపాధ్యాయులు రాజసురేశ్, రాజేశ్, రాంచందర్, అమ్జద్, ఉమారాణి, సురేశ్, పీఈటీ, విద్యార్థులను అభినందించారు.

హాకీ టోర్నీకి ఎంపిక..
భీమ్‌గల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి రంజిత్ రాష్ట్ర స్థాయి హాకీ టోరీకి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ చిరంజీవీ తెలిపారు. ఈనెల 2న ఆర్మూర్‌లో నిర్వహించిన అండర్-19 హాకీ పోటీల్లో రంజిత్ చక్కని ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి వరకు ఖమ్మంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో రంజిత్ పాల్గొంటాడని తెలిపారు. రంజిత్‌ను ప్రిన్సిపాల్ చిరంజీవి, లెక్చరర్లు అభినందించారు.

బీచ్‌బాల్ పోటీలకు బడాభీమ్‌గల్ విద్యార్థిని..
భీమ్‌గల్ మండలంలోని బడాభీమ్‌గల్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని పూజిత రాష్ట్ర స్థాయి బీచ్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేశ్ తెలిపారు. ఎంపికైన విద్యార్థిని ఈనెల 5 నుంచి వరకు మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పూజిత పాల్గొనడం జరుగుతుందన్నారు. పూజితను ప్రధానోపాధ్యాయుడుతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

సాఫ్ట్‌బాల్ పోటీలకు ఆర్మూర్ విద్యార్థులు..
సాఫ్ట్‌బాల్ పోటీల్లో సాంఘిక సంక్షేమ పాఠశాల ఆర్మూర్ విద్యార్థులు తిరుపతి, వివేక్, శశాంక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రాజేందర్, రాకేశ్‌లను అభినందించారు. కార్యక్షికమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ ప్రధాన కార్యదర్శి ఎం.గంగామోమన్, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ భూమేశ్వర్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్, ఉపాధ్యాయులు చిన్న య్య, సురేశ్, ఆర్మీ ఆఫీసర్ సంతోష్ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన
సిరికొండ మండల కేంద్రంలోని కామధేను జూనియర్ కళాశాల విద్యార్థులు మహేశ్, మహిపాల్, గోపాల్, మేఘల్ రాష్ట్రసాయి హాకీ పోటీలకు ఎంపికైనందున పాఠశాల ప్రిన్సిపాల్ బాశెట్టి లింబాద్రి విద్యార్థులను అభినందించారు. ఇటీవల ఆర్మూర్ మినీ స్టేడియంలో జరిగిన అండర్-19 విభాగం హాకీ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్ల్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈనెల 6 నుంచి వరకు ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి హాకీ క్రీడల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...