ఆడబిడ్డల పెండ్లికి అండ కల్యాణలక్ష్మి పథకం


Wed,December 4, 2019 01:30 AM

ఖలీల్‌వాడి : నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలు స్తున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని కింగ్ ప్యాలెస్‌లో 150 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మంగళవారం పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కావడం తన అదృష్టమని అన్నారు.

ఆడబిడ్డ పుడితే బాధ పడకూడదని సీఎం కేసీఆర్ ఆలోచించి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి, ఆడపిల్ల పెండ్లికి రూ.లక్షా 1,116 అందిస్తున్నారని, గత సంవత్స రం పదివేల చెక్కులను పంపిణీ చేశామని, అన్ని చెక్కులతో పాటు పెళ్లి కూతురికి చీర, పెళ్లి కొడుకుకు బట్టలు తన సొం త డబ్బులతో అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని లక్ష బ్యాగులను పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని, అందు లో ముఖ్యమైనది కల్యాణలక్ష్మి పథకమని, దీని ద్వారా ఒక పేద ఆడబి డ్డ పెండ్లి అవుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఆలోచించి పింఛన్లను కూడా రూ.200 నుంచి రూ వరకు పెంచి, వాటిని మళ్లీ రూ. 2016 పెంచి పేద కుటుంబాలను ఆదుకుంటున్నారని తెలిపారు. అన్ని విధాలుగా సీఎం కేసీఆర్ పేద ప్రజలకు పథకాలు ప్రవేశపెట్టి సహాయం చేస్తున్నారని, ఈ పథకాలు పొందిన వారు అందరూ సీఎం కేసీఆర్‌ను దేవుడిగా చూస్తున్నారని తెలిపారు.


ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం..
ప్రజల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నా రు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్షికమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్ట డంతోనే పేదలు తమ ఇంటి ఆడబిడ్డకు ఘనంగా పెండ్లి చేస్తున్నారని అన్నారు. కార్యక్షికమంలో నుడా చైర్మన్ ప్రభాకర్‌డ్డి, నార్త్ తహసీల్దార్, సీనియర్ లీడర్లు సుజిత్ సింగ్ ఠాకూర్, దారం సాయిలు, దండు శేఖర్, అంబాదాస్, రా జేంద్ర ప్రసాద్, సూదం రవిచందర్, సాయిరాం, మల్కా యి మహేందర్, బిల్లా మహేశ్, మాదని శ్రీధర్, పుప్పాల భాజన్న, ముచ్కుర్ నవీన్, సీతారాం, జీవన్, ఆర్‌ఎల్ నరసింహ, సదానంద్, దిల్‌రాజ్ సింగ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...