ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం


Tue,December 3, 2019 03:20 AM


బోధన్, నమస్తే తెలంగాణ: బోధన్ పట్టణంలోని వేంక ఉన్న శ్రీలక్ష్మీ సమేత వేంక ఆలయంలో సోమవారం శ్రావణ నక్షవూతాన్ని పురస్కరించుకొని వేంక కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. విశ్వక్సేనా ఆరాధనతో ప్రారంభమైన స్వామివారి కల్యాణం ఆద్యంతం భక్తులను పరవశింపజేసింది.


కల్యాణోత్సవాన్ని యాగ్నికులు సారంగపాణి శ్యామసుందరాచార్యులు, అర్చకులు నరసింహమూర్తి, దీపక్ మహారాజ్ వేద మంత్రోచ్ఛారణలతో జరిపించారు. స్వామివారి కల్యాణోత్సవాలకు వెండితో తయారుచేసిన జంధ్యాన్ని పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి కటకం రమేశ్ సతీమణి యాగేశ్వరి బహూకరించారు. కార్యక్షికమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పబ్బ మురళి, కూనల్ శంకర్‌గౌడ్, చదలవాడ వేంక కటకం రమేశ్, న్యాయవాది దత్తాత్రి కులకర్ణి, వ్యాపారి ఎర్ర చంద్రశేఖర్, స్వప్న, భక్తురాలు అనసూయ తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...