ప్రజావాణి సమస్యలను పరిష్కరించాలి


Tue,December 3, 2019 03:20 AM

ఖలీల్‌వాడి/ ఇందూరు: ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వచ్చిన 125 వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు అక్కడే పరిష్కరించాలన్నారు.

ఈ దిశగా తమ కింది స్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలన్నారు. విద్యాశాఖ, సంక్షేమ శాఖల పరిధిలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇతర వివరాలను సమర్పించాల్సిందిగా అదే విధంగా నిర్మాణాలు, వాటికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధి పనులు గురించి, ఆయా శాఖల కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా కోరినప్పటికీ సరైన స్పందన లేదని, ఈ నెల 5వ తేదీలోగా ఈ వివరాలన్నీ కచ్చితంగా సమర్పించాలని ఆదేశించారు.

రాష్ట్ర స్థాయి నుంచి అధికారులు వివరాలు కోరుతూ పంపించే డీవో లేఖలు ప్రిన్సిపల్ సెక్రెటరీ, శాఖల కార్యదర్శులు, ఇతర పై స్థాయి అధికారులు పంపించే లేఖలపై వ్యక్తిగతంగా స్పందించి నివేదికలు వెంటనే సమర్పించాలని పేర్కొన్నారు. కలెక్టర్ ద్వారా అడిగిన సమాచారాన్ని నిర్ణీత నమూనాలో పంపించాలని తెలిపారు. ఆయాశాఖల ద్వారా సమర్పించే ఫైల్స్ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని శాఖలు పరిష్కరించాల్సిన లేఖలు ఆయా కార్యాలయాల్లో స్వీకరించనందున కలెక్టరేట్లో సమర్పిస్తున్నారని, ఏ కార్యాలయాలకు సంబంధించిన లేఖలు ఆ కార్యాలయంలో స్వీకరించాలని తెలిపారు. ప్రజావాణి నుంచే డివిజన్, మండల స్థాయిలో జరుగుతున్న ప్రజవాణి దరఖాస్తుల స్వీకరణ పరిస్థితిని వీడియో కాన్ఫన్సు ద్వారా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇతర శాఖలు అధికారులు కూడా తప్పకుండా హాజరుకావాలని వారికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సూచించారు. కార్యక్షికమంలో జేసీ వెంక డీఆర్వో అంజయ్య, ఆర్డీవో వెంక డీఆర్డీవో రమేశ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


కలెక్టర్‌ను కలిసిన ఏజీ బృందం
కలెక్టరేట్‌తో పాటు ఇతర కార్యాలయాలను ఆడిట్ చేయడానికి అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి జిల్లాకు వచ్చిన బృందం ఎస్‌ఏవో రాజు నాయక్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావును మర్యాద పూర్వకంగా తన చాంబరులో కలిశారు. వారు నిర్వహించే ఆడిట్ విషయాలను కలెక్టర్‌కు వివరించారు. కార్యక్షికమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, కలెక్టరేట్ ఏవో సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.


టీఎస్ ఐపాస్ అనుమతులకు
సమయం కేటాయించాలి
జిల్లాలో టీఎస్ ఐపాస్ ఇండస్ట్రీయల్ ప్రమోషన్ కోసం వచ్చిన దరఖాస్తుల అనుమతులకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయం త్రం కలెక్టర్ చాంబరులో టీఎస్ ఐపాస్, డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిక్షిశమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి సులభంగా, త్వరగా అనుమతులు మంజూరు చేసేందుకు టీఎస్ ఐపాస్‌ను అమల్లోకి తీసుకొచ్చిందని అన్నారు. ఏ మాత్రం ఆలస్యానికి అవకాశం లేకుండా నిర్ణీత సమయంలో దరఖాస్తుదారులకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. అభ్యంతరాలు ఉన్నా కూడా వెంటనే వారికి సమాచారం అందించి తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించాలని ఆదేశించారు.

తద్వారా ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా జరుగుతాయని పరిక్షిశమలు స్థాపించిన వారితో పాటు జిల్లా అభివృద్ధి చెందుతుందని, ఆర్థిక లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఈ సందర్భంగా పది మంది ఎస్సీ దరఖాస్తుదారులకు, ఏడు గురు గిరిజన దరఖాస్తుదారులకు పెట్టుబడి సబ్సిడీ మంజూరు చేసేందుకు టీ ప్రీడ్ పాలసీ కింద అనుమతులు మంజూరు చేశారు. సమావేశంలో ఇండస్ట్రీస్ జీఎం సమ్మయ్య, మైన్స్ ఏడీ సత్యనారాయణ, ఎల్‌డీఎం జయ సంతోషి, డీఎస్‌సీడీవో శశికళ, డీటీడబ్ల్యూవో సంధ్యారాణి, డీపీవో జయసుధ, రవాణా, పొల్యూషన్ కంట్రోల్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...