పౌష్టికాహారం తయారు చేసుకోవాలి


Tue,December 3, 2019 03:19 AM

రుద్రూర్/కోటగిరి : బాలింతలు తమకు, తమ బిడ్డకు కావాల్సిన పౌష్టికాహారాన్ని తయారు చేసుకోవాలని గృహవిజ్ఞాన శాస్త్రవేత్త భవ్య మంజరి అన్నారు. మండలకేంవూదంలోని జేఎన్‌సీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో కృషివిజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కార్యక్షికమాన్ని నిర్వహించారు.

ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు ఏఏ నెలలో ఏ విదమైన ఆహారాన్ని తీసుకోవాలో సూచించారు. పౌష్టికాహారాన్ని వంటింట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలియజేశారు. గర్భిణులు, బాలింతలు ఇనుము, క్యాల్షియం ఎక్కువగా ఉండే పాలు, గుడ్లు, చేపలు, పప్పుదాన్యాలు, ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు, మునగ ఆకు, కరవేపాకు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. వంట చేసేటప్పుడు విటమిన్లు నష్టపోకుండా జాగ్రత్తలు తెలిపారు. ఈ కార్యక్షికమంలో అంగన్‌వాడీ టీచర్లు పద్మ, గర్భిణులు పాల్గొన్నారు.


పౌష్టికాహారం అందజేత
గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రంలోనే పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్‌వాడీ టీచర్ స్వరూప అన్నారు. గన్నారం అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం చిన్నారులకు బరువు, ఎత్తు కొలతలు తీశారు. అనంతరం గర్భిణులకు పౌష్టికాహారం అందించారు. ప్రతి వారం కేంద్రాల్లో ఎన్‌హెచ్‌డీ కర్యక్షికమం ఉంటుందన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...