అద్దె భవనంలో శాఖ గ్రంథాలయం


Mon,December 2, 2019 12:41 AM

మాక్లూర్‌: గ్రంథాలయాలు మనుషుల జీవితాలను మార్చే ఆధునిక దేవాలయాలు.. అలాంటి గ్రంథాలయాలు గ్రామీణ ప్రాంతంలో అరకొర సౌకర్యాలతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని శాఖ గ్రంథాయలం అద్దె భవనంలో అరకొర సౌకర్యాల మధ్య కొన సాగుతుండడంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1986లో అప్పటి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ‘తెలుగు విజ్ఞాన కేంద్రం’ పేరుతో ప్రతి మండలంలో శాఖ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి మండల కేంద్రంలో శాఖ గ్రంథాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. కేవలం రెండు గదుల్లోనే గ్రంథాలయ నిర్వహణ జరుగుతుండడం గమన్హారం.

ఒకగది పాఠకులకు, మరో గది గ్రంథాలయ నిర్వహకులకు కేటాయించారు. దిన, వార పత్రికలతో పాటు పక్షం, మాస పత్రికలు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో సర్పంచులు శాఖ గ్రంథాలయం శాశ్వత భవన నిర్మాణానికి చర్యలు చేపట్టినా నిధుల లేమి కారణంగా నిలిచిపోయింది. టీడీపీ పాలనలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాం వరకు వాటి నిర్మాణం పూర్తికాలేదంటే అప్పటి పాలకుల పనితీరు ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు గ్రంథాలయ భవన నిర్మాణానికి రెండు రూ. లక్షల నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వ పాఠశాల పక్కన గ్రామస్తులు ఉచితంగా స్థలాన్ని కేటాయించారు. సంబంధిత కాంట్రాక్టర్‌ తూతూ మంత్రంగా పనులు చేసి పిల్లర్లు స్లాబు వేసి చేతులు దులుపుకొన్నారు. మండల బీఆర్‌జీఎఫ్‌ నుంచి రూ. లక్ష మంజూరు చేయగా మూడేళ్ల తర్వాత మళ్లీ పనులు మొదలు పెట్టారు. దీంతో అసంపూర్తిగ ఉన్న భవనానికి కిటికిలు బిగించి, గోడలు నిర్మించి నిధులు సరిపోక పోవడంతో మధ్యలోనే నిలిపివేశారు. దశాబ్దాలు గడుస్తున్నా భవనం మాత్రం పూర్తి కాలేదు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మండల వాసులు కోరుతున్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...