అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి


Sat,November 30, 2019 02:34 AM

మోపాల్ : ఆడబిడ్డలపై అఘాయిత్యాలు, లైంగికదాడులకు, హత్యలకు పాల్పడే మృగాలను కఠినంగా శిక్షించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం మోపాల్ మండలం బోర్గాం (పి) గ్రామ శివారులో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ రామ్మోహన్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపిల్లలు నేటి సమాజంలో ఎవరిని తొందరగా నమ్మువద్దని అన్నా రు. షాద్‌నగర్, వరంగల్‌లో గురువారం జరిగిన సంఘటనలు తన మనసును కలిచివేసిందన్నారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా విద్యార్థులకు గురుకులాలు, వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. రూ. 1.60 కోట్లతో బోర్గాం గ్రామంలో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహంలో ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థినులకు వసతి గృహం ఏర్పాటు చేశామని తెలిపారు. మనసున్న మారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆర్టీసీ కార్మికుల ఎలాంటి షరతులు లేకుండా విధులకు తీసుకోవడం, మరణించిన కార్మికుల పిల్లలకు ఉద్యో గం ఇస్తామని హామీ ఇవ్వడంతో వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని అన్నా రు. నియోజకవర్గానికి మంజూరైన బాలికల డిగ్రీ కళాశాలను గన్నారం గ్రామంలో ఏర్పా టు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, స్థలం ఉన్న వారికి రూ. 5లక్షలతో ఇంటిని నిర్మించే కార్యక్షికమాలు జనవరి నుంచి చేపడుతామని అన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...